Telangana History : హైదరాబాద్ లో అండమాన్ జైలు.. ఇది చూసే కాలాపానీ కట్టారు

కాలాపాని జైలు అనగానే చాలామందికి అండమాన్లోని సెల్యులార్ జైలు గుర్తుకు వస్తుంది. కానీ ఆ జైలుకన్నా సుమారు యాభై ఏళ్లముందే తెలంగాణలో అలాంటి జైలు ఉంది. అండమాన్ జైల్లో స్వాతంత్ర్య సమరయోధులను బందీలుగా ఉంచితే.. అంతకంటే ఎక్కువ చరిత్ర ఉన్న ఇక్కడి కాలాపాని జైల్లో తప్పు చేసిన బ్రిటీష్ సైనికులను ఉంచేవాళ్లు. అండమాన్లో కాలాపాని జైలు కట్టడానికి నమూనా కూడా ఈ జైలే.

తెలంగాణలో ఉన్నకాలాపాని జైలు గురించి చాలా కొద్దిమందికి మాత్రమే  తెలుసు . ఇప్పటితరం వాళ్లకైతే పూర్తిగా తెలియకపోవచ్చు. ఎప్పుడు కట్టారు? ఎక్కడ ఉంది? దాని చరిత్ర ఏంటి? ప్రత్యేకతేంటి... తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు.

ఎక్కడ.. ఎలా కట్టారు?

సికింద్రాబాద్ దగ్గర్లో ఉన్న తిరుమలగిరి. చౌరస్తాకు అతి సమీపంలో ఉంది ఈ కారాగారం 1858లో అప్పటి బ్రిటీష్ అధికారులు ఈ జైలుసు కట్టించారు. రోజుల్లోనే దీని నిర్మాణానికి 4.71 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ఈ జైలు విస్తీర్ణం సుమారు ఇరవై వేల మూడువందల నలభై నాలుగు చదరపు అడుగులు (20,344) ఇది  మూడు అంతస్తుల భవనం పై నుంచి శిలువ ఆకారంలో కనిపిస్తుంది.  రెండు మూడు అంతస్థుల్లో కలిపి  7.5 గదులు ఉన్నాయి. కింది.. అంతస్తులో నలభై గదులున్నాయి. ఈ గదులు తప్పించుకునే అవకాశం లేకుండా తలుపులను ఇనుముతో గట్టిగా తయారు చేశారు. ఖైదీలను ఇనుపతాళ్లతో కట్టివేసే వాళ్ళు ఇక్కడ

కిటికీలు

ఈ జైల్లో ఉన్న కిటీకీల గురించి వివరంగా చెప్పాలి. ప్రతి గదికి ఒక్క చిప్పటికీ ఉంటుంది. అయితే వి అందరికీ తెలిసిన కిటికీల లాంటివి కాడు. చాలా ప్రత్యేకంగా కట్టినవి ఎలా అంటే.. గదిలోపలున్న ఖైదీలు కిటికీ నుంచి బయటకు  చూస్తే వాళ్లకు కేవలం కిటికీకి ఎదురుగా ఉన్న కొద్ది ప్రదేశం మాత్రమే కనిపిస్తుంది. బయట ఏం జరుగుతుందో తెలియదు కానీ, బయటి నుంచి కిటికి గుండా లోపలికి చూస్తే మాత్రం.. గదిలోని ప్రతిభాగం పూర్తిగా కనిపిస్తుంది. ఖైదీలు లోపల ఏం ఎలా ఉన్నారు? అన్నీ చూదొన్పటు ఇప్పటికీ ఈ కిటికీల నిర్మాణం అంతుచిక్కని రహస్యమే.

ఉరిశిక్ష

జైలు మూడో అంతస్థు పై భాగంలో ఉరిశిక్ష అమలు చేసేందుకు సంబంధించిన ముందు అధికారులు ఖైదీలకు వాళ్ల ఇన్ని ప్రార్థించుకునే అవకాశం కూడా కల్పించేవారట! అందుకోసం ఒక గదిని  ఏర్పాటు చేశారు. ఆ గదిలో వివిధ మణాలకు చెందిన దేవుళ్లు, దేవతల పటాలు ఉండేవి. ఉరిశిక్ష అమలు చేసేటప్పుడు ఏదైనా లోపం వల్ల ఖైదీ చనిపోకపోతే, ఉరికంబం కింద ఉన్న బావిలో పడి తప్పకుండా చనిపోయేవాడట. ఎందుకంటే, సరిగ్గా ఉరి స్తంభం కింది వంద అడుగుల లోతున్న బావి ఉంది. ఈ బాని అడుగున బాణాలాంటి ఇనుప చువ్వలు ఉన్నాయి. అందువల్ల ఉరిశిక్ష వేసిన ఖైదీ బతికే అవకాశం ఉండేది కాదు. ఈ కాలాపాని జైలో బదువందలమందికి ఉరి వేసినట్లు అధికారులు

ప్రత్యేకత

ఈ జైలు పైనుంచి చూస్తే సికింద్రాబాద్ అంతా! కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ జైలు మిలిటరీ వాళ్ల ఆధీనంలో ఉంది. ఇతరులను లోపలకు అనుమతించడం లేదు. కేంద్ర ప్రభుత్వం దీనిని నేషనల్ మ్యూజియంగా ప్రకటించింది. ఈ జైలుకు హెరిటేజ్ అవార్డు కూడా లభించింది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో వండలాని మంది సైనికులను ఇక్కడే ఉంచారు. అలాగే ఆపరేషన్ స్టార్లో భాగంగా (1984లో స్వర్ణదేవాలయం సంఘటనకు సంబంధించినది) అ ఖైదీలను ఇక్కడే ఉంచారు. 1994 నుంచి ఈ జైలు వినియోగంలో లేదు. తిరుమల గిరిలోని మిలిటరీ అధికారుల అనుమతితో ఈ జైలును చూదొచ్చు. ఇప్పటికీ ఇది చెక్కు చెదరకుండా ఉంది. అందుకే. అండమాన్ జైలును చూడాలనుకునే వాళు అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు.. -మన భాగ్యనగరంలోని ఈ జైలును చూడొచ్చు.