అంజన్న భక్తుల సెల్​ఫోన్లు చోరీ

ఆర్మూర్, వెలుగు:  కొండగట్టుకు పాదయాత్రగా వెళ్తూ.. గురువారం రాత్రి ఆర్మూర్ మున్సిపల్​ పరిధిలోని పెర్కిట్​హనుమాన్ మందిరంలో నిద్రించిన హనుమాన్ భక్తుల ఐదు సెల్ ఫోన్లను ఓ దుండగుడు దొంగిలించాడు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.  బాధితులు గణేశ్​, నవీన్, రాజన్న, విక్కీ, నాగార్జున శుక్రవారం ఆర్మూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.