హోలీ పండగ అంటే ఎవరికి ఇష్టం ఉండదు.. పండు ముసలి నుంచి పడుచు పిల్లల వరకు అందరికి హోలీని సెలబ్రేట్ చేసుకోవాలని.. రంగులు చల్లుకోవాలని ఉంటుంది. రంగులు చల్లుకునే క్రమంలో కొన్ని సార్లు మన దగ్గర ఉన్న కొన్ని విలువైన వస్తువులు కోల్పోతుంటాం.. అందులో ముఖ్యమైంది మొబైల్స్.. ఇలా వీటిని జోబులో ఉంచుకుని హోలీ ఆడుతున్న సందర్భంలో ఎక్కడో పడేసుకొని కోల్పోతుంటాం. దీంతో విలువైన వస్తువులను క్షణంలోనే కోల్పోయిన వారిమి అవుతాం. వీటితో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది..
మరీ ముఖ్యంగా సెల్ ఫోన్..
హోలీకి సంబంధించి ఎన్నో మదుర జ్ఞాపకాలను దాచుకునేందుకు ఫ్రెండ్స్, రిలెటీవ్స్ తో కలిసి ఫోటోలు దిగుతుంటాం. ఈ క్రమంలోనే ఫోన్ పై రంగులు పడి చెడిపోయే ప్రమాదం ఉంది. ఫోన్ కు రంగులు అంటడమో.. లేదంటే. ఫోన్ నీళ్లలో పడడమో జరుగుతుంది. కాబట్టి సెల్ఫీలు దిగే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫొన్ తీసుకెళ్తే దాన్ని దాచుకోవడానికి ఓ కవర్ తీసుకెళ్తే బాగుంటుంది.