దేశవ్యాప్తం సంచలనంగా మారిన ట్రైనీ డాక్టర్ హత్యాచారం, హత్య కేసులో సీబీఐ ఎంక్వైరీ వేగవంతం చేసింది. ప్రధాన నిందితుడిగా భావించి పోలీసులు అరెస్ట్ చేసిన సంజయ్ రాయ్ కు సీబీఐ ఆదివారం సైకోనాలసిస్ టెస్ట్ చేయనుంది. దీని ద్వారా అతని మెంటల్ కండీషన్ ను చెక్ చేస్తారు పోలీసులు.. తర్వాత పూర్తి స్థాయిలో నేరవిచారణ చేస్తుంది సీబీఐ. సంజయ్ రాయ్ కు సైకోనాలసిస్(మానసిక విశ్లేషణ) టెస్ట్ చేయడాని ఢిల్లీలోని ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ నుంచి కొంతమంది నిపుణులను CBI కోల్ కతా పంపింది.
పోలీస్ ఇన్ఫార్మర్ గా పని చేస్తున్న సజయ్ రాయ్ ను కల్ కతాలోని RG కార్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజీలోని ట్రైనీ డాక్టర్ ను అత్యాచారం, హత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు.. ఇప్పటి వరకు అతనే ప్రధాన నిందితునిగా భావిస్తున్నారు. బాధితురాలుకి న్యాయం చేయాలని దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనలు చేస్తున్నారు. వైద్యసేవలు నిలిపి.. కొవ్వత్తులతో రోడ్లపై ర్యాలీలు చేస్తున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రధానమంత్రి వారి డిమాండ్లతో ఓ లేక రాసింది. రాష్ట్రాల్లో జరుగుతున్న నిరసనల గురించి శాంతిభద్రతల దృష్యా ప్రతి రెండు గంటలకు నివేదిక ఇవ్వాలని కేంద్ర హోం శాఖ రాష్ట్రాలను కోరింది.