తెలంగాణలో 83.64 లక్షల ఇండ్లలో కులగణన సర్వే పూర్తి

  • రాష్ట్రంలో మొత్తం 1,16,14,349 ఇండ్లు 

హైదరాబాద్​, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కుల గణన సర్వే ఇప్పటివరకూ 72 శాతం పూర్తయ్యింది. రాష్ట్రంలో మొత్తం 1,16,14,349 ఇండ్లను గుర్తించగా.. మంగళవారం నాటికి  83,64,331 ఇండ్లలో సర్వే కంప్లీట్​ అయింది. ములుగులో అత్యధికంగా 98.9 శాతం ఇండ్లలో కులగణన సర్వే పూర్తి కాగా.. ఆ జిల్లా తొలి స్థానంలో నిలిచింది. 95 శాతంతో నల్గొండ జిల్లా రెండో స్థానంలో, 93.3 శాతంతో జనగామ జిల్లా మూడో స్థానంలో కొనసాగుతున్నాయి. 

జీహెచ్ఎంసీలో అత్యల్పంగా 50.3 శాతం ఇండ్లలో సర్వే పూర్తయింది. మేడ్చల్​లో 61.3 శాతం, హనుమకొండలో 63, వికారాబాద్​ జిల్లాలో 67.4 శాతం ఇండ్లలో సర్వే కంప్లీట్​ అయింది. కాగా, త్వరితగతిన సర్వే పూర్తి చేయాలని అధికారులను సీఎస్​ ఆదేశించారు.