నిజామాబాద్ జిల్లాలో డ్రంకెన్‌‌‌‌ డ్రైవ్‌‌‌‌ కేసులో  ఆరుగురికి జైలు 

 నిజామాబాద్ క్రైమ్, వెలుగు: డ్రంకెన్‌‌‌‌ డ్రైవ్‌‌‌‌ చేస్తూ పట్టుబడిన ఆరుగురిని మంగళవారం కోర్టులో హాజరుపరచగా స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ బేగం 2 రోజుల జైలు శిక్ష విధించారు. శివ తాండకు చెందిన కేతావత్ సంతోష్, ముల్లంగి గ్రామానికి చెందిన షేక్ జియావుద్దీన్, మద్దేపల్లి గ్రామానికి చెందిన విశ్వనాధ్, పోతంగల్ గ్రామానికి చెందిన తోకల సంజీవ్, బోధన్‌‌‌‌కు చెందిన బంటు శ్రీనివాస్‌‌‌‌కు రెండు రోజులు, మెట్రాజ్ పల్లి గ్రామానికి చెందిన ఇసపల్లి అబ్బాయ్యకు ఒకరోజు జైలు శిక్ష విధించారు. 

నలుగురిపై  కేసు

సిరికొండ,వెలుగు: మందు తాగి డ్రైవ్‌‌‌‌ చేస్తున్న నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాము తెలిపారు. మంగళవారం తమ సిబ్బంది డ్రంక్  డ్రైవ్ టెస్టు చేయగా నలుగురు తాగి బండి నడిపినట్లు నిర్ధారణ కావడంతో కేసు నమోదు చేశామన్నారు.