కొండగట్టులో భక్తుల నుంచి వసూళ్లు ఇద్దరిపై కేసు 

కొండగట్టు, వెలుగు : కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చిన భక్తులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌‌‌‌ఐ కుమారస్వామి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మేడిపల్లి మండల కేంద్రానికి చెందిన రజిత, కరుణాకర్ బంధువులు. ఇద్దరూ కలిసి కారులో గురువారం ఉదయం కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చారు.

తిరుగు ప్రయాణంలో కొండగట్టు శివారులో కారు ఆపి ప్రసాదం తింటున్నారు. ధరూర్ గ్రామానికి చెందిన వెంకటేశ్‌‌‌‌, సారంగాపూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన చంద్రశేఖర్ వారిని బెదిరించి వారి వద్ద నుంచి రూ.8వేలు వసూలు చేశారు. రజిత తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.