వీధి కుక్కలను చంపించిన ఘటనలో మచ్చర్ల వీడీసీపై కేసు

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ మండలం మచ్చర్లలో వీధి కుక్కలను చంపించిన ఘటనలో గ్రామాభివృద్ధి కమిటీపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు. నాలుగు రోజుల కింద గ్రామంలోని 33 కుక్కులను గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారని కొందరు సోషల్​ మీడియాలో వైరల్ చేయగా, జంతు ప్రేమికులు ఆర్మూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

పోలీసుల ఆదేశాల మేరకు వెటర్నరీ డాక్టర్ ప్రభాకర్ గ్రామానికి వెళ్లి చనిపోయిన కుక్కలకు పోస్ట్​మార్టం చేసి రిపోర్ట్​ అందించారు. కుక్కలను చంపిన విషయంలో తమకు వచ్చిన ఫిర్యాదు మేరకు మచ్చర్ల వీడీసీపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. కాగా గ్రామంలో వీధి కుక్కలు ఎక్కువై మనుషులపై దాడులు చేస్తున్నాయన్న గ్రామస్తుల వినతితో వీడీసీ వాళ్లు కుక్కలను చంపించేందుకు చర్యలు తీసుకోగా, అది రివర్స్ అయినట్లు తెలుస్తోంది.