భూ వివాదంలో 9మందిపై కేసు

ఎల్లారెడ్డిపేట, వెలుగు: ఎల్లారెడ్డిపేట మండలకేంద్రంలో ఓ వ్యక్తి తన సొంత ప్లాటులో ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. ఈ ఘటనలో 9 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ రమాకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు.

మండల కేంద్రానికి చెందిన శ్రీరామోజు సత్యనారాయణ ఇదే గ్రామంలో తన ప్లాటులో బోరు వేస్తుండగా పక్కనున్న సద్దిమద్దుల సంఘం సభ్యులు అడ్డుకున్నారు. ఈభూమి తమ సంఘానికి చెందిందని బెదిరించినట్లు సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ తెలిపారు.