కార్డియో వర్కవుట్స్ కోసం జిమ్కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూడా వీటిని సులభంగా చేసేయొచ్చు. జంప్ స్క్వాట్స్, మౌంటేన్ క్లైంబర్స్, కెటిల్ బాల్ స్వింగ్, బర్ఫీస్ వంటి కార్డియో వ్యాయామాల వల్ల కొవ్వు త్వరగా కరుగుతుంది. గుండె, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ఉత్సాహాన్ని పెంచే ఎండార్ఫిన్ లు విడుదలవుతాయి. అయితే, వారంలో కనీసం గంట నుంచి రెండున్నర గంటలు కార్డియో ఎక్సర్ సైజ్ లు చేయాలి.
* జంప్ స్క్వాట్స్ చేయడం వల్ల చాతి, వెన్నుభాగం స్ట్రాంగ్ అవుతుంది.
*దాంతో ఇతర వర్కవుట్స్ చేయడం ఈజీ అవుతుంది.
* మౌంటేన్ క్లైంబింగ్ తో చాలా కండరాలకు వామప్ అవుతుంది. దాంతో అవి బలంగా మారతాయి.
* ఈ ఎక్సర్సైజ్ గుండె హెల్దీగా ఉంటుంది.
* కండరాలు దృఢంగా, ఫ్లెక్సిబుల్ గా ఉండేందుకు కెటిల్బాల్ స్వింగ్ పనికొస్తుంది. ఈ వ్యాయామం చేస్తే బ్యాలెన్స్ వస్తుంది.
* బాడీ పొజిషన్ కూడా మెరుగవుతుంది.
* బర్ఫీ ఎక్సర్ సైజ్లు కొవ్వుని కరిగించడమే. కాకుండా రక్తప్రసరణని పెంచుతాయి. గుండెని బలంగా చేస్తాయి.
* అలాగే, జంపింగ్ జాగ్స్ చేసినా కూడా రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది.