కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్ ఇప్పుడు మనదేశంలో కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఈ ఫీచర్‌ని 2019లో గూగుల్ పిక్సెల్4లో తెచ్చింది. ఈ కొత్త ఫీచర్ మొదట్లో సెలక్ట్ చేసిన కొన్ని దేశాల్లో మాత్రమే ఉండేది. కానీ, ఇప్పుడు ఆస్ట్రియా, బెల్జియం, పోర్చుగల్, స్విట్జర్లాండ్లతోపాటు మనదేశంలోనూ వచ్చేసింది. అయితే ఇండియాలో ఈ ఫీచర్ కేవలం పిక్సెల్ 4ఎ, 6ఎ, 7, 7 ప్రొ, 7ఎ, 8, 8 ప్రొ వంటి మోడల్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్స్‌లో అయితే... పిక్సెల్ 7, పిక్సెల్ ఫోల్డ్‌తో సహా అన్ని మిగతా మోడల్స్‌లోనూ ఈ ఫీచర్ ఉంది. అయితే, ఈ ఫీచర్ ఇంగ్లిష్, డానిష్, డచ్, ఇటాలియన్, జపనీస్ వంటి పదకొండు భాషల్లో ఉంది.
ఇలా ఆన్ చేయాలి
- పిక్సెల్ ఫోన్లో క్రాష్ డిటెక్షన్ ఫీచర్‌ను ఎలా ఆన్ చేయాలంటే... ఫోన్లో యాప్ మేనేజర్లో ఉన్న పర్సనల్ సేఫ్టీ అనే యాప్ ఓపెన్ చేయాలి.
- పర్సనల్ సేప్టీ యాప్‌లో ఫీచర్స్ ఆప్షన్ సెలక్ట్ చేయాలి.
- కార్ క్రాష్ డిటెక్షన్ మీద ట్యాప్ చేయాలి.
- కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్‌ని ‘సెటప్’ చేసే ఆప్షన్ కనిపిస్తుంది. సెటప్ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి దానిపై ట్యాప్ చేయాలి.
- ఫీచర్ బాగా పని చేయడానికి లొకేషన్ షేర్ చేయమని ప్రాంప్ట్ వస్తుంది. ‘ఎలౌ వైల్ యాప్ ఈజ్ ఇన్ యూజ్’ ఆప్షన్ ట్యాప్ చేయాలి. క్రాష్ టైంలో లొకేషన్ యాక్సెస్ చేసే యాప్ పర్మిషన్ ఇస్తుంది.
- ఆ తర్వాత మైక్రోఫోన్‌ని షేర్ చేయడానికి, ఫిజికల్ యాక్టివిటీని యాక్సెస్ చేసేందుకు పర్మిషన్ ఇస్తుంది. క్రాష్ డిటెక్షన్ ఫీచర్ ఫుల్ యాక్టివిటీని ఎనేబుల్ చేయడానికి ‘ఎలౌ’ ఆప్షన్ మీద ట్యాప్ చేయాలి.
ఇలా పని చేస్తుంది
పైన చెప్పిన పిక్సెల్ మోడల్ ఫోన్లు, ఫోల్డబుల్ ఫోన్లతో పాటు డివైజ్ లొకేషన్, మోషన్ సెన్సర్లు దగ్గర్లోని సౌండ్స్ గ్రహిస్తాయి. తద్వారా యూజర్ల కారు క్రాష్‌కి గురైతే వెంటనే తెలిసిపోతుంది. అది తెలుసుకోవాలంటే... కారు క్రాష్ రికగ్నిషన్ కోసం లొకేషన్, ఫిజికల్ యాక్టివిటీ, మైక్రోఫోన్ యాక్సెస్ ఉండాలి. క్రాష్‌ని గుర్తించిన ఫోన్ వెంటనే ఎమర్జెన్సీ సర్వీస్‌లకు కాల్ చేస్తుంది. ఈ ఫోన్ కాల్ ఆండ్రాయిడ్ ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్‌ను వాడుకుంటుంది. క్రాష్ అయిన లొకేషన్ గురించి సమాచారం ఇవ్వడమే కాకుండా అక్కడి పరిస్థితిని కూడా చెప్తుంది. మంచి ఫీచరే కానీ అన్నిసార్లు ఫోన్ క్రాష్ సౌండ్ గుర్తించలేకపోవచ్చు. ఒక్కోసారి నెట్వర్క్ సిగ్నల్ లేకపోయినా, ఫోన్లో మాట్లాడుతున్న టైంలో యాక్సిడెంట్ జరిగితే ఇలాంటి ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందని గూగుల్ బ్లాగ్ పోస్ట్‌లో రాశారు. ఇలాంటి సందర్భాలను పక్కన పెడితే కొంతమేర మాత్రం ఈ ఫీచర్ పనికొస్తుందన్నమాట!
ప్రమాదాలు చెప్పి రావు. అలాంటప్పుడు ఈ ఫీచర్ బాగా పనికొస్తుంది. కార్లో వెళ్తున్నప్పుడు సడెన్‌గా యాక్సిడెంట్ అయితే... వెంటనే ఫోన్ అలర్ట్ అయ్యి ఎమర్జెన్సీ నెంబర్‌కి ఫోన్ చేస్తుంది. ఆ నెంబర్‌కి లొకేషన్ కూడా షేర్ చేస్తుంది. ఈ ఫీచర్ గురించిన అప్డేట్స్ ఇవి.