కారు, లారీ ఢీ..నలుగురికి తీవ్ర గాయాలు ఇద్దరి పరిస్థితి విషమం.. శ్రీశైలం హైవేలో ప్రమాదం

ఇబ్రహీంపట్నం, వెలుగు: శ్రీశైలం హైవేలో లారీ, కారు ఢీకొన్న ఘటనలో నలుగురు ఐటీ ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. సిటీకి చెందిన నూకల శ్రీకాంత్, శ్రీధర్, వంశీకృష్ణ, నగేశ్​ఐటీ ఉద్యోగులు. కారులో అమ్రాబాద్​వెళ్లారు. 

తిరిగి వస్తుండగా శనివారం మధ్యాహ్నం మహేశ్వరం మండలం తుమ్మలూర్ మ్యాక్ ప్రాజెక్ట్స్ గేట్–2 సమీపంలో రాంగ్​రూట్​లో వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. నలుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. వంశీ కృష్ణ, శ్రీధర్ పరిస్థితి విషమంగా ఉంది. మహేశ్వరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. .