వాట్సాప్​ ప్రొఫైల్​ ఫొటో..స్క్రీన్​ షాట్​ తీయలేరు!..ఈ ఫీచర్​తో

వాట్సాప్​లో యూజర్ల ప్రైవసీ కోసం మరో కొత్త అప్​డేట్ వచ్చింది. ఇప్పటివరకు వాట్సాప్​లో యాడ్​ చేసుకోని  యూజర్లకు ప్రొఫైల్ ఫొటోలు కనిపించకుండా హైడ్ చేసే ఆప్షన్​ ఉంది. అయితే, ఇతరులు మీ ప్రొఫైల్​ ఫొటో స్క్రీన్​ షాట్ తీయకుండా ఆపడానికి ఎలాంటి ఆప్షన్ లేదు. కానీ, ఇప్పుడు దానికోసం బ్లాకింగ్​ ఆప్షన్ అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ ఫీచర్​తో పర్సనల్ ఫొటోలు డౌన్​లోడ్ చేసుకోవడం, షేర్ చేయడం వంటివాటిని అడ్డుకోవచ్చు.

ఆండ్రాయిడ్​ యూజర్ల కోసం ఈమధ్యే వాట్సాప్ బీటా, గూగుల్ ప్లే స్టోర్​లో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. యూజర్లు వేరే వాళ్ల ప్రొఫైల్ ఫొటోను స్క్రీన్ షాట్ చేయడానికి ప్రయత్నిస్తే నోటిఫికేషన్ డిస్​ప్లే అవుతుంది. ఆ నోటిఫికేషన్​లో యాప్​ పరిమితుల కారణంగా స్క్రీన్​ షాట్​ తీయలేరనే పాప్​ అప్ మెసేజ్ వస్తుంది. అయితే, స్ర్కీన్​ షాట్ తీయలేకపోయినా, వేరే ఫోన్​లో కెమెరాతో ఫొటో తీసుకునే అవకాశం ఉందని గమనించాలి.