ఎవరి ఓటు ఎటు?.. జనం అంతరంగం తెలుసుకునేందుకు పార్టీల సర్వేబాట

  •     టెలిఫోన్ కాల్స్‌‌‌‌.. యూత్‌‌‌‌ టీంతో అభిప్రాయ సేకరణ
  •     గెలుపు అవకాశాల  కోసం ప్రధాన పార్టీ క్యాండిడేట్ల పాట్లు
  •     నామినేషన్ల గడువు సమీపిస్తున్న టైంలో టెన్షన్​

నిజామాబాద్,  వెలుగు:  ఇందూరు పార్లమెంట్​ స్థానానికి పోటీ చేస్తున్న మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్ల నాడి తెలుసుకోవడానికి సర్వే బాట పట్టారు. నామినేషన్లు వేసే సమయం దగ్గరపడుతున్నందున తమ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయో పసిగట్టేందుకు గ్రౌండ్​ లోకి  టీంలను వదిలారు. మూడు పద్ధతులు ద్వారా ఓటర్ల మనసులో మాట కనిపెట్టేందుకు ప్రయత్నాలు షురు చేశారు. 

ఫోన్ల ద్వారా ఓటర్ల అంతరంగం తెలుసుకోవడం, డోర్​టు డోర్​ వెళ్లి ఓటు ఎవరికి వేయనున్నారో నోట్​ చేసుకుంటున్నారు. దీంతో పాటు మైనార్టీ ఓటర్ల అభిప్రాయాలు సేకరిస్తున్నారు.   ఈనెల 18న ఎలక్షన్​ నోటిఫికేషన్​ వెలువడి నామినేషన్లు దాఖలు చేసే గడువు ముగిసే 25 తేది నాటికి సర్వే రిపోర్టు అందేలా ఏర్పాట్లు చేసుకున్నారు. బీజేపీ నుంచి సిట్టింగ్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​, కాంగ్రెస్​ అభ్యర్థిగా జీవన్​రెడ్డి, బీఆర్​ఎస్​ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్​ బరిలో నిలిచారు. ఈ ముగ్గురు అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా తమ వ్యుహాలతో ముందుకు వెళ్తున్నారు. 

సెంట్రల్​ స్కీంలు గుర్తు చేస్తూ

బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్​ తరఫున ఫోన్​ కాల్స్​తో ఓటర్లతో టచ్‌ లో ఉంటున్నారు. ఎలక్షన్​లో ఎవరికి ఓటు వేయనున్నారు? అని అడుగుతున్నారు.  నలుగురు చొప్పున యూత్​ రోజుకు వంద ఇండ్లకు వెళ్లి ఓటర్ల అంతరంగం తెలుసుకుంటున్నారు. 2019 ఎన్నికలప్పుడు కమలానికి లీడ్​ ఇచ్చిన పోలింగ్​ సెంటర్స్​లోని ఓటర్ల వద్దకు వెళ్లి అవి ఖాయంగా ఉన్నాయా? టర్న్​ అయ్యాయా? ఆరా తీస్తున్నారు.  

తర్వాత సెంట్రల్​ గవర్నమెంట్​ స్కీంలను ఓటర్లకు గుర్తు చేస్తూ కాల్స్​ చేస్తున్నారు. ఆహారభద్రత కింద ఫ్యామిలీలోని ఒక వ్యక్తికి ఐదు కిలోల బియ్యం, వ్యవసాయానికి అందిస్తున్న సబ్సిడీలు కంటిన్యూ కావడానికి మోదీని మరోసారి ప్రధానిని చేయాలని కోరుతూ ఫోన్​ చేస్తున్నారు.  సుమారు 2 వేల మంది ఈ పనిలో ఉన్నట్లు సమాచారం.  ఎక్కడ వీక్ గా ఉన్నామో తెలుసుకుని ఆ ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని భావిస్తున్

గులాబీ పార్టీలో...

అసెంబ్లీ ఎలక్షన్స్​లో పనిచేసిన టీంకే ప్రస్తుత పార్లమెంట్​ సెగ్మెంట్​ సర్వే విధులను  బీఆర్​ఎస్​ క్యాండిడేట్​ బాజిరెడ్డి గోవర్ధన్​ అప్పగించారు. పార్టీ హైకమాండ్​ విడిగా మరో సర్వే చేయిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్​ సెంటర్స్​ వారీగా పొందిన ఓట్లలో మార్పును ఈ రెండు టీంలు  ఆరా తీస్తున్నాయి. వారంలో సర్వే పూర్తయి రెండు టీంల రిపోర్టును క్రాస్​ చెక్​ చేశాక మున్ముందు ప్లాన్​ రెడీ చేయాలని నిర్ణయించారు.  ముఖ్యమైన లీడర్లు చాలా వరకు పార్టీ వీడి వెళ్లిన కారణంగా అభ్యర్థి బాజిరెడ్డి ఇప్పటికే అయోమయంలో ఉన్నారు. ఆయన్ను కలవడానికి వస్తున్న కార్యకర్తలతో క్షేత్ర స్థాయి పరిస్థితులపై ఆరా తీస్తున్నాయి. బూత్​ల వారీగా కారు గుర్తుకు ఎన్ని ఓట్లు వస్తాయో? అంచనాలు వేస్తున్నారు. 

మైనారిటీలు ఎటు..?

పార్లమెంట్​ సెగ్మెంట్​లో మొత్తం 13,49,934  ఓట్లుండగా అందులో మైనారిటీల ఓట్లు క్రియాశీలంగా మారాయి. ఈ సారి అవి ఎటు  వెళ్లనున్నామయనే పాయింట్​కు మూడు పార్టీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ వర్గం ఓట్లు మెజారిటీగా ఎవరికి పడతాయో కనుక్కోవడానికి బీజేపీ ఆసక్తి చూపుతుండగా బీఆర్​ఎస్​ వాటిపై దాదాపు ఆశలు వదులుకుంది. కమలం గుర్తు అంటే గిట్టని మైనారిటీలు పార్లమెంట్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ వైపు టర్న్​ అయినట్లు అంచనా వేస్తున్నారు. 

కాంగ్రెస్​ నుంచి జీవన్​రెడ్డి కూడా...

పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్​ నుంచి పోటీ చేస్తున్న జీవన్​రెడ్డి పక్షాన గ్రౌండ్​ రియాల్టీ కన్ఫర్మ్​ చేసుకోవడానికి ​అనుభవమున్న ఎలక్షన్​ ఏజెన్సీతో సర్వే చేయిస్తున్నారు. అసెంబ్లీ ఎలక్షన్​ ప్రామాణికంగా సర్వే నడుస్తోంది. స్టేట్​లో కాంగ్రెస్​ గవర్నమెంట్​ వచ్చాక మరింత పుంజుకున్నామని భావిస్తున్న పార్టీ లీడర్లు రైతులు, నిరుద్యోగ యువత, మహిళలు, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్​ పొందుతున్న ఇండ్ల వద్దకు సర్వే టీంను పంపిస్తున్నారు.  

సర్కారు పట్ల పాజిటివ్​ కంటే నెగిటివ్​ పాయింట్స్​ సేకరించడానికి ప్రయారిటీ ఇస్తున్నారు.  సుమారు 2  వేల మందితో కూడిన సర్వే టీం గ్రౌండ్​లో పని చేస్తోంది. పార్టీ కార్యకర్తలను కలవకుండా ఓటర్ల దగ్గరకు వెళ్లి వాస్తవ రిపోర్టు అందేలా ఏర్పాట్లు చేశారు. బూత్​ లెవల్​ పార్టీ క్యాడర్​తో మరో సమాచారాన్ని సెగ్మెంట్​ లీడర్లు సేకరిస్తున్నారు. గ్రౌండ్ లో ఉన్న రియల్టీ మాత్రమే చెప్పాలని స్ట్రిక్ట్‌ ఆదేశాలిచ్చారు.