నిజామాబాద్ ఎంపీ సెగ్మెంట్ లో  స్పీడ్​ పెంచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు 

  •     ప్రతి నిమిషం కీలకమే
  •     రెండు రోజులు గ్యాప్​ లేకుండా ప్రచారానికి ప్లాన్​ 
  •       నిజామాబాద్ ముఖ్య లీడర్ల సభలతో వచ్చిన జోష్
  •     పోలింగ్​ దాకా కంటిన్యూ చేయాలని నిర్ణయం 

నిజామాబాద్​, వెలుగు: పార్లమెంట్​ఎన్నికల ప్రచారానికి కౌంట్​డౌన్​ షురూ కావడంతో బరిలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు జోష్​ పెంచారు. మరి కొన్ని36 గంటల్లో ప్రచారంముగియనున్న దృష్ట్యా దూకుడుగా వెళ్లాలని డిసైడ్​ అయ్యారు.  బీజేపీ, కాంగ్రెస్​, బీఆర్‌‌ఎస్​ పార్టీల నుంచి వార్డులు, డివిజన్​లు, విలేజ్​లలో కార్యకర్తలను డోర్​టు డోర్​ ప్రచారానికి దింపారు.  లీడర్ల ప్రచారం తప్పితే నిన్నటి దాకా భిన్నంగా ఉన్న పల్లె వాతావరణం ఒక్కసారిగా మారింది. పార్టీ కండువాలు మెడలో వేసుకొని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు.

అభ్యర్థుల ఉరుకులు.. పరుగులు

 ఇందూర్​ పార్లమెంట్​స్థానంలో మొత్తం 29 మంది పోటీ చేస్తుండగా ముఖ్య పార్టీలైన బీజేపీ నుంచి అర్వింద్​, కాంగ్రెస్​ పక్షాన ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి, బీఆర్​ఎస్​ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్​ నుంచి బరిలో ఉన్నారు.  ఈ ముగ్గురూ గెలుపును సవాల్​గా తీసుకొని ముందుకు సాగుతున్నారు.  ఎండల తీవ్రత కూడా ప్రచారంపై ప్రభావం చూపింది.  13న పోలింగ్ జరగనుండగా 11న సాయంత్రం 6 గంటలకు ప్రచారం క్లోజ్​ కానుంది.  ఎండల కారణంగా కార్యకర్తలు బయటకు వచ్చి ప్రచారం  చేయడానికి ఇష్టపడలేదు.  అభ్యర్థులు కూడా  వారిని ఒత్తిడి చేయలేదు.  ఎండలు కాస్త తగ్గడంతో సీన్​మారి హుషారుగా ప్రచారం చేస్తున్నారు.  ముగ్గురు క్యాండిడేట్లు ప్రచారానికి సంబంధించి ప్రతి నిమిషాన్ని యూజ్​ చేసుకోవాలని డిసైడ్​ అయ్యారు.  ఆఖరు రోజు అసెంబ్లీ సెగ్మెంట్​లలో భారీ ర్యాలీలతో  క్లోజింగ్​ ప్లాన్​ చేశారు.

బడా నాయకులు హాజరు 

మార్చి 18న బీజేపీ అభ్యర్థి అర్వింద్​ కోసం ప్రచారానికి ప్రధాని మోదీ జగిత్యాల వచ్చారు.  అక్టోబర్​ 2న నిజామాబాద్​లో భారీ సభ నిర్వహించారు.  గత నెల 25న ఉత్తరాఖండ్​ సీఎం పుష్కర్​సింగ్​ ధామి ఇందూర్​ రాగా ఈనెల 5న కేంద్ర హోం మంత్రి అమిత్​షా ప్రచార సభకు అటెండ్​అయ్యారు. కాంగ్రెస్​ అభ్యర్థి జీవన్​రెడ్డి ప్రచారానికి సీఎం రేవంత్​రెడ్డి నిజామాబాద్​కు గత నెల 22న మే 1న కోరుట్లకు 8న ఇందూరుకు మరోసారి వచ్చారు. బీఆర్​ఎస్​ క్యాండిడేట్​ బాజిరెడ్డి గోవర్ధన్​ ప్రచారానికి పార్టీ అధినేత ఈనెల 5, 6 తేదీల్లో జగిత్యాల, నిజామామాద్​ వచ్చారు. గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని కీలక నేతలు చేసిన ప్రచారం క్యాడర్​లో జోష్​ పెంచింది. దీన్ని  పోలింగ్​ దాకా కొనసాగించాలని అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు.