OMG : మీరు ఎక్కువగా కార్లలో తిరుగుతున్నారా..క్యాన్సర్ రావొచ్చంట..!

కార్లలో తిరగడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు..ఆఫీసు పనిమీదనో..లేక సొంత పనిమీదనో ఎక్కువ దూరం  ప్రయాణించాల్సి వస్తే..చాలామంది బైకుల కన్నా కార్లను ఎక్కువగా వాడుతుంటారు. కొందరైతే టూర్ల ప్లాన్ చేసుకొని ప్రత్యేకంగా కార్లలో ప్రయాణాలు చేస్తుంటారు. అయితే కారులో అద్దాలు వేసుకొని క్యాబిన్ లో కూర్చుంటే ఆరోగ్యానికి ప్రమాదమే అని హెచ్చరిస్తున్నారు కార్ల గురించి అధ్యయనం చేసినోళ్లు. 

ఎన్విరాన్ మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇటీవల అధ్యయనం కారు క్యాబిన్ గాలి నాణ్యత గురించి భయంకరమైన నిజాలను వెల్లడించింది. కార్లలో ప్రయాణిం చేవారు తీవ్రమైన అనారోగ్యం బారిన పడే అవకాశాలున్నంటున్నారు. అత్యంత ప్రమాదరకమైన క్యాన్సర్ కు కారణమయ్యే కెమికల్స్ కారు క్యాబిన్ లో ఉత్ప త్తి అవుతాయని అధ్యయనాల్లో వెల్లడైంది. 

30 రాష్ట్రాల్లో నిర్వహించిన ఈ అధ్యయనంలో 2015 నుంచి 2022 వరకు మోడల్ కార్లను పరిశీలించారు. ప్రజలు తమ కార్లలో ఉన్నప్పుడు క్యాన్సర్ కు కారణమయ్యే కెమికల్స్ ను పీల్చుకుంటున్నారని తాజా అధ్యయనంలో తేలింది. ఎన్వినార్ మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మే 7ప ప్రచురించబడిన అధ్యయనం..చాలా కార్ల లో క్యాన్సర్ కు కారణమయ్యే ఫ్లేమ్ రిటార్డెంట్ కెమికల్స్ ఉన్నాయని వెల్లడించింది. 99 శాతం కార్లలో TCIPP అనే ఫ్లేమ్ రిటార్డెంట్ ఉందని, ఇది ప్రస్తుతం యూఎస్ నేషనల్ టాక్సికాలజీ ప్రోగ్రాం ద్వారా క్యాన్సర్ కారకంగా వెల్లడైంది. అంతేకాదు కార్లలో TDCIPP, TCEP అనే మరో రెండు ఫ్లేమ్ రిటార్డెంట్లు కూడా ఉన్నాయట. ఇవి కూడా క్యాన్సర్ కారకాలేనట. 

సగటున ప్రతి రోజూ కారులో గంట గడుపితే అది ఆరోగ్యానికి ప్రమాదమే అని పరిశోధకులు అంటున్నారు. ఎక్కువ కాలం ప్రయాణాలు చేసే వ్యక్తులు, పిల్లలపై ప్రభావం చూపొచ్చని అంటున్నారు. శ్వాస సంబంధిత ఇబ్బందులు ఏర్పడతాయట. ముఖ్యంగా వేసవి కాలంలో వేడి కారణంగా కారులో కెమికల్స్ విడుదల పెరుగు తుందని, క్యాబిన్ గాలిలో క్యాన్సర్ కలిగించే సమ్మేళనాలకు సీట్ ఫోమ్ ప్రధాన కారణమని పరిశోధకులు అంటున్నారు. 

కారు కిటికీలు తెరవడం, షెడ్లు, గ్యారేజీలలో కారు పార్కింగ్ సమయంలో టాక్సిక్ ఫ్లేమ్ రిటార్డెంట్ వాడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. వాహనాల్లో ఫ్లేమ్ రిటార్డెంట్ల వాడకాన్ని పూర్తిగా తగ్గించాలంటున్నారు.