వలస విధానంలో తప్పులు చేశాం: ఒప్పుకున్న కెనడా ప్రధాని ట్రూడో

ఒట్టావా: తమ దేశ వలస విధానంలో తప్పులు చేశామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అంగీకరించారు. కొన్ని శక్తులు వ్యవస్థలోని లోపాలను దుర్వినియోగం చేశాయని ఆయన పేర్కొన్నారు. ఈమేరకు తన యూట్యూబ్  చానెల్ లో ఆయన ఓ వీడియోను పోస్టు చేశారు. అమాయక వలసదారులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని, కెనడా పౌరసత్వం లభించేలా చూస్తామని చెప్పి కొంతమంది మోసం చేశారని ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలో కెనడాకు వచ్చే వలసదారుల సంఖ్యను వచ్చే మూడేండ్లలో తగ్గించాలని నిర్ణయించామని తెలిపారు. కాగా.. అధికార లిబరల్  పార్టీకి ప్రజాదరణ రోజురోజుకు తగ్గిపోతున్న నేపథ్యంలో ట్రూడో ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.