షుగర్ పేషంట్స్, గర్భిణీలు వెల్లుల్లి తినవచ్చా..?

వంట చేసేటప్పుడు, వెల్లుల్లి ఆహారానికి రుచి, వాసనను అందిచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయి. వెల్లిల్లు షుగర్ పేషంట్స్ తినవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడానికి, రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రించడానికి సహాయపడుతుంది. అంతే కాదు హృదయనాళ సమస్యల తగ్గిస్తోంది. కానీ, గర్భణీలు మాత్రం అధికంగా వెల్లుల్లి ఉండకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

వెల్లుల్లిలో విటమిన్ సి, విటమిన్ B6, మాంగనీస్ వంటి అవసరమైన పోషకాలు ఉన్నప్పటికీ, ప్రెగ్నెన్సీ టైంలో మహిళలలు వెల్లుల్లి మితంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే రక్తం పలుచబడటానికి మందులు వాడే రోగులు కూడా వెల్లుల్లి తక్కువగా తినాలని డాక్టర్లు అంటున్నారు. ఎందుకంటే వెల్లుల్లి రక్తాన్ని పలుచగా చేస్తోంది. ఆ మందులు వాడుకుంటూ.. వెల్లిల్లు తింటే రక్తం మరీ పలుచగా అయి అనారోగ్యానికి గురవుతారని నిపుణులు సూచిస్తున్నారు.

వెల్లుల్లి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు
 జీర్ణ ప్రక్రియను సులభతరం చేస్తుంది. వెల్లుల్లిలో అల్లిసిన్ వంటి సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి. రోగనిరోధక వ్యవస్థకు మంచి బూస్టింగ్ ఇస్తాయి. ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి. వెల్లుల్లి రక్తపోటును తగ్గించడం, కొలెస్ట్రాల్,రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీంతో గుండె జబ్బులు, స్ట్రోక్ రాకుండా ఉంటాయి. వెల్లుల్లి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఆర్థరైటిస్ వంటి పరిస్థితుల లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. వెల్లుల్లిలోని అజోయిన్ అనే ఎంజైమ్ వివిధ చర్మ వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. 

వీరీ అసలే తినకూడదు
వెల్లుల్లి కొందరికి ఎలర్జీ లక్షణాలను కలిగిస్తోంది. ఇది పడని వాళ్లు తినకపోవడం మంచింది. లేదంటే చర్మంపై దద్దుర్లు, దురద లేదా జీర్ణశయాంతర అసౌకర్యం వంటి లక్షణాలను అనుభవిస్తారు.