బరువు తగ్గడానికి ఒకటో రెండో కాదు వందల్లో డైట్ ప్లాన్స్ వచ్చాయి. కానీ, వాటిల్లో ఎంత వెతికినా చాలావరకు ఆలుగడ్డలు కనిపించవు. కారణం అవి తింటే బరువు పెరుగుతారని. అయితే ఇదంతా అపోహ అంటున్నారు డాక్టర్ సిద్ధాంత్ భార్గవ అంతేకాదు ఏదైనా ఒక వెజిటబుల్ లేదా మరేదైనా పదార్థం తినడం వల్ల బరువు పెరగడం, తగ్గడం ఉండదు అనేది ఆయన వాదన.
ఆలుగడ్డని కూరగా తింటే ప్రాబ్లం లేదు. కానీ, ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్ తింటే కచ్చితంగా బరువు పెరుగుతారనే మాటలు అక్కడా ఇక్కడా వినే ఉంటాం. అవి కూడా అపోహలే. ఆలుగడ్డలో కార్బోహైడ్రేట్స్, గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే మాటనిజమే అయినా..వీటిని మోడర్ ని పద్ధతిలో తింటే బరువుకొచ్చిన డోకా ఏం లేదు. పైగా బోలెడు లాభాలున్నాయి అంటున్నారు ఈ డాక్టర్. అవేంటంటే...
• ఆలుగడ్డలో రెసిస్టెంట్ స్టార్చ్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది ప్రోబయోటిక్ గా పనిచేసి, మలబద్ధకం, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ని దరిచేరనివ్వదు.
• ఆలుగడ్డలోని యాంటీ ఆక్సిడెంట్స్.. ఫ్రీరాడికల్స్ పోరాడి సెల్స్ డ్యామేజ్ ని తగ్గిస్తాయి.
• శరీరానికి సరిపడా పొటాషియం అందకపోతే ... సోడియం లెవల్స్ పడిపోతాయి.. దానివల్ల బ్లడ్ ప్రెజర్ లెవల్స్ బాగా తగ్గుతాయి. అలాంటప్పుడు పొటాషియం ఎక్కువగా ఉండే ఆలుగడ్డలు తింటే బ్లడ్ ప్రెజర్ అదుపులో ఉంటుంది.
• ఆలుగడ్డలోని ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. వీటిల్లోని జింక్, ఫాస్పరస్, విటమిన్ బి, బి6 బ్రెయిన్ ఫంక్షనింగికి సాయపడతాయి.
• నిద్రకి ప్రేరేపించే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది ఆలుగడ్డలో. దీనివల్ల కంటినిండా నిద్రపోవచ్చు.
• ఆలుగడ్డ ప్రి-మెనుస్ట్రువల్ సిండ్రోమ్ నుంచి బయటపడేస్తుందని చాలా స్టడీల్లో తేలింది. వీటిల్లోని కార్ప్స్ శరీరంలో ట్రిప్టోఫాన్ లెవల్స్ ని పెంచుతాయి. అది సెరటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ని రిలీజ్ చేసి ప్రి - మెనుస్ట్రువల్ యాంగ్జెటీ, ఒత్తిడిలను తగ్గిస్తుంది.
• ఆలుగడ్డలోని ఐరన్, క్యాల్షియం ఎముకలకి బలాన్నిస్తాయి. అంతేకాదు ఆలుగడ్డ అందాన్ని కూడా కాపాడుతుంది. ఆలుగడ్డ జ్యూస్ లేదా ముక్కలతో ముఖాన్ని మసాజ్ చేస్తే డార్క్ సర్కిల్స్, ముడతలు తగ్గుతాయి.