iPhone 16 Camera Controls:ఐ ఫోన్ 16 సిరీస్‌లో ఫీచర్స్ అదుర్స్ కెమెరా ఆప్షన్స్ చూస్తే షాక్

ఐఫోన్ కొత్త సరీస్ లో ఇప్పటి వరకు ఏ ఫోన్ తీసుకురాని ఫీచర్ తెచ్చింది. ఆపిల్ కంపెనీ సెప్టెంబర్ 9న ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ లాంచ్ చేసింది. ఇందులో ఇచ్చిన కెమెరా ఆప్షన్ యూసర్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ఆప్షన్ తో ఐఫోన్ 16లో కేవలం సెకన్ లో కెమెరా ఓపెన్ చేయోచ్చు. క్విక్ కెమెరా ఆప్షన్స్ కోసం, DSLR కెమెరా షట్టర్ ఎక్స్ పీరియన్స్ పొందడానికి హై ప్రెసిషన్ ఫోర్స్ సెన్సార్ ను ఆపిల్ కంపెనీ ఉపయోగించింది. 

బెస్ట్ క్వాలిటీ ఫోటోస్ తీసుకోవచ్చనే చాలామంది ఐఫోన్ తీసుకుంటారు. అంత బాగుంటుంది యాపిల్ ఫోన్ లో ఫోటో క్వాలిటీ.  ఐఫోన్ 16లో సిరీస్ లో విడుదలైన నాలుగు మోడల్స్ లో లైట్ ప్రెస్, ట్యాప్, స్లయిడ్ మూడు టచ్ ఆప్షన్లు ఇచ్చింది.  ఇది ఎలా పని చేస్తోంది. దీని వల్ల ఉపయోగం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ALSO READ | ఏఐ ఫీచర్లతో యాపిల్ ఐఫోన్‌‌16 ఫోన్లు

సాధారణంగా మంచి ఫొటోస్ కెమెరాలో బంధించాలి అంటే వెంటనే స్పందిచడం ముఖ్యం.. ఆపిల్ 16 సిరీస్ ఫోన్లో ఇచ్చిన ఈ సెట్టింగ్స్ తో సెకన్ కంటే తక్కువ టైంలో కెమెరా ఓపెన్ చేయవచ్చు. కెపాసిటివ్ టచ్, సెన్సార్ క్లిక్, స్లయిడ్ ఆప్షన్లు ఇందులో ఇచ్చారు. ఈ ఫోన్ సైడ్ లో ఓ సెన్సార్ ఉంది. సెన్సార్ పై వేలు పెట్టి అటూ ఇటూ తిప్పితే జూమ్ ఇన్, జూమ్ ఔట్ అవుతుంది. ఫోటో క్లిక్ చేయాలన్నా సెన్సార్ పై ఓ ట్యాప్ చేస్తే చాలు. ఈ కెమెరా ఆప్షన్లు 16 సిరీస్ నాలుగు ఐ ఫోన్ మోడల్లో తీసుకువచ్చింది కంపెనీ.