టూల్స్ గాడ్జెట్స్ : టెంపరేచర్ రింగ్‌‌‌‌

ఈ మధ్య చాలామందికి ఎప్పుడు ఏ వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎటాక్‌‌‌‌‌‌‌‌ చేస్తుందో.. ఎప్పుడు ఏ జబ్బు వస్తుందో తెలియడం లేదు. అందుకే ఎప్పటికప్పుడు ఆరోగ్యం మీద శ్రద్ధ పెడుతున్నారు. మరీ ముఖ్యంగా జ్వరం వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు టెంపరేచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెక్‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలి. టెంపరేచర్ మరీ ఎక్కువగా ఉంటే వెంటనే డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దగ్గరకు వెళ్లాలని చెప్తున్నారు ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్స్‌‌‌‌‌‌‌‌. అలా ఎప్పటికప్పుడు టెంపరేచర్ చూసుకోవడం అందరికీ వీలుపడకపోవచ్చు.

అలాంటివాళ్లు ఈ స్మార్ట్‌‌‌‌‌‌‌‌ రింగ్‌‌‌‌‌‌‌‌ వాడితే సరిపోతుంది. దీన్ని వేలికి పెట్టుకున్న 20 నుంచి 30 సెకన్లలో టెంపరేచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిస్‌‌‌‌‌‌‌‌ప్లే అవుతుంది. కాకపోతే.. ఇది టెంపరేచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని సెంటిగ్రేడ్స్‌‌‌‌‌‌‌‌లో చూపిస్తుంది. పిల్లలు, పెద్దలు ఎవరైనా వాడొచ్చు. దీన్ని రీఛార్జ్‌‌‌‌‌‌‌‌ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో బ్యాటరీలు కూడా ఉండవు. హీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్షన్‌‌‌‌‌‌‌‌ అనే కంపెనీ దీన్ని అమ్ముతోంది. దీన్ని జువెలరీలా కూడా వాడుకోవచ్చు. 

ధర : 174 రూపాయలు 

క్వాడ్రీ పాడ్‌‌‌‌ 

పెద్దవాళ్లు వేకువజామునే నిద్ర లేచి వాకింగ్ చేస్తుంటారు. కానీ.. ఆ టైంలో చీకట్లో సరిగ్గా కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అదే... ఈ వాకింగ్ స్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేతిలో ఉంటే అలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. ఇది చాలా తేలికగా ఉంటుంది. ఎత్తుని -అడ్జస్ట్​ చేసుకోవచ్చు. చీకట్లో మన కాలు జారినా, ఈ స్టిక్‌‌‌‌‌‌‌‌ కాలు మాత్రం జారదు. దీనికి స్కిడ్ రెసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ గ్రిప్స్ ఉంటాయి.

ఫోల్డబుల్ డిజైన్‌‌‌‌‌‌‌‌తో వస్తుంది. సింగిల్‌‌‌‌‌‌‌‌ పుష్-బటన్‌‌‌‌‌‌‌‌తో దీన్ని హ్యాండ్‌‌‌‌‌‌‌‌బ్యాగ్‌‌‌‌‌‌‌‌లో పట్టేంత సైజులోకి మార్చేయొచ్చు. ఆర్థరైటిస్, రుమాటిజం లాంటి సమస్యలు ఉన్నవాళ్లకు ఇది బెస్ట్‌‌‌‌‌‌‌‌ ఛాయిస్‌‌‌‌‌‌‌‌. చీకట్లో నడిచేటప్పుడు వెలగుని ఇచ్చేందుకు ఇందులో ఎల్‌‌‌‌‌‌‌‌ఈడీ లైట్‌‌‌‌‌‌‌‌ కూడా ఇన్‌‌‌‌‌‌‌‌బిల్ట్‌‌‌‌‌‌‌‌గా ఉంది. దీన్ని ఎంట్రోస్‌‌‌‌‌‌‌‌ అనే కంపెనీ మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి తెచ్చింది. 

ధర : 1,390 రూపాయలు 

ఎమర్జెన్సీ అలారం

ఆడవాళ్ల సేఫ్టీ కోసం మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చాలా రకాల అలారం గాడ్జెట్స్‌‌‌‌‌‌‌‌ ఉన్నాయి. కానీ.. ఇది కాంపాక్ట్ సైజులో ఉండే సేఫ్టీ సైరన్‌‌‌‌‌‌‌‌. లాకెట్‌‌‌‌‌‌‌‌లా మెడలో వేసుకోవచ్చు. కీచైన్‌‌‌‌‌‌‌‌లా కూడా పట్టుకోవచ్చు. అయితే.. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు దీని సౌండ్‌‌‌‌‌‌‌‌ మాత్రం చాలా పెద్దగా వస్తుంది. దీనికి130 డెసిబల్స్ సౌండ్‌‌‌‌‌‌‌‌ కెపాసిటీ ఉంటుంది. ఆడవాళ్లు ఒంటరిగా వెళ్తున్న టైంలో ఆకతాయిలు, దొంగలు దాడి చేసినప్పుడు దీన్ని నొక్కితే చాలా దూరం వినిపిస్తుంది.

దాంతో ఎవరో ఒకరు వచ్చి కాపాడే అవకాశం ఉంటుంది. పర్స్, బ్యాక్‌‌‌‌‌‌‌‌ప్యాక్, కీ, బెల్ట్ లూప్‌‌‌‌‌‌‌‌, సూట్‌‌‌‌‌‌‌‌కేస్‌‌‌‌‌‌‌‌కు అటాచ్ చేసుకోవచ్చు. రాత్రిపూట ప్రయాణం, హైకింగ్, క్యాంపింగ్, డాగ్ వాకింగ్ చేసే టైంలో ఇది వెంట ఉంటే ధైర్యంగా వెళ్లొచ్చు. దీనికి ఒక కాంపాక్ట్ పిన్‌‌‌‌‌‌‌‌ ఉంటుంది. దాన్ని రిమూవ్‌‌‌‌‌‌‌‌ చేసిన వెంటనే అలారం మొదలవుతుంది. మళ్లీ ఆ పిన్‌‌‌‌‌‌‌‌ పెట్టేవరకు మోగుతూనే ఉంటుంది. ఇందులో మూడు చిన్న బ్యాటరీలు ఉంటాయి. వాటిలో పవర్ తగ్గితే లో బ్యాటరీ ఇండికేషన్‌‌‌‌‌‌‌‌ ఇస్తుంది. దీన్ని గ్రెస్టాక్‌‌‌‌‌‌‌‌ అనే కంపెనీ మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి తీసుకొచ్చింది. 

ధర, 1,200 రూపాయలు

మోషన్ సెన్సర్‌‌‌‌‌‌‌‌ 

టెక్నాలజీ పెరిగిన తర్వాత చాలామంది ఇండ్లలో మోషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెన్సర్ లైట్స్​ వాడుతున్నారు. కానీ.. ఈ సెన్సర్లు లైట్లతో పాటే ప్యానెల్‌‌‌‌‌‌‌‌లో ఉంటాయి. దానివల్ల లైట్‌‌‌‌‌‌‌‌ ఫెయిల్‌‌‌‌‌‌‌‌ అయితే..  డబ్బులు పెట్టి సెన్సర్ కొనాల్సి వస్తుంది. ఈ సెన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోల్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఆ సమస్యకు ఫుల్‌‌‌‌‌‌‌‌స్టాప్‌‌‌‌‌‌‌‌ పెట్టొచ్చు. ఆటో ఆన్‌‌‌‌‌‌‌‌ అనే కంపెనీ ఈ సెన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి  తెచ్చింది. ఇంట్లో బల్బ్‌‌‌‌‌‌‌‌ పెట్టే హోల్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ సెన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని బిగించాలి.

దీనికి ఉండే హోల్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బల్బ్‌‌‌‌‌‌‌‌ పెట్టాలి. ఈ గాడ్జెట్‌‌‌‌‌‌‌‌కి మోషన్ సెన్సర్ వేలాడుతూ ఉంటుంది. మనిషి వచ్చినప్పుడు డిటెక్ట్‌‌‌‌‌‌‌‌ చేసి, లైట్ ఆన్​ చేస్తుంది. మనుషుల కదలిక లేకపోతే ఆఫ్‌‌‌‌‌‌‌‌ చేస్తుంది. ఈ టైమింగ్‌‌‌‌‌‌‌‌ని కూడా 5 సెకండ్ల నుంచి 10 నిమిషాల వరకు మార్చుకోవచ్చు. బల్బ్‌‌‌‌‌‌‌‌ ఫెయిల్‌‌‌‌‌‌‌‌ అయినా మార్చుకోవచ్చు. దీని ఒక ఏడాది వారెంటీ కూడా ఉంటుంది. ఈజీగా ఇన్‌‌‌‌‌‌‌‌స్టాల్‌‌‌‌‌‌‌‌ చేసుకోవచ్చు. 

ధర : 439 రూపాయలు