బీర్.. ఎండాకాలం వచ్చిందంటే చాలు..యువత ఎక్కువగా ఇష్టపడే డ్రింక్..బీర్ తాగితే ఆరోగ్యానికి మంచిదే అని ..బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు పోతాయని ..బీర్ ఆల్కహాల్ కాదని నమ్ముతుంటారు..అసలు బీర్ ఆల్కహాల్ కాదా.. బీర్ తాగితే ఆరోగ్యానికి నిజంగానే హానిలేదా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోంది.. డాకర్లు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం.
ఇటీవల కాలంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) బీర్ పై విడుదల కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అదేంటంటే ఆల్కహాల్ ఏ మోతాదులో తీసుకున్నా.. ఆరోగ్యానికి మంచిది కాదని.. ఇప్పుడు డాక్టర్లు దీనిపైనే పెద్ద చర్చపెట్టారు. ఆల్కహాల్ ఏ మోతాదులో తాగినా సురక్షితం కాదని డబ్ల్యూ హెచ్ వో చేప్పినప్పటికీ .. ప్రజలు తాగడానికి కొన్ని సాకులు చెబుతున్నారని డాక్టర్లు అంటున్నారు. బీర్ నిజంగా ఆల్కహాల్ కాదని.. రోజూ ఓ పానియంలా తీసుకోవడం పూర్తిగా మంచిదని ప్రజలు భావిస్తున్నారని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మాహిమ్ లోని పీడీ హబిందూజా హాస్పిటల్ అండ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ కు చెందిన గ్యాస్టో ఎంటరాలజిస్ట్ డాక్టర్ పవన్ ధోబ్లే దీని గురించి నిజంగా ఆందోళన వ్యక్తం చేశారు. డబ్ల్యూహెచ్ వో ఆల్కాహాల్ ను గ్రేడ్ 1 క్యాన్సర్ కారకంగా లేబుల్ చేసింది. అయినా ప్రజలు ఇప్పటికీ అపోహలు నమ్ముతున్నారు.సిగరేట్ ప్యాకెట్ల మాదిరిగానే మద్యం బాటిళ్లపై కూడా భయంకర హెచ్చరికలు జారీ చేసే అంత సీరియస్ ఇష్యూ అని ఆయన అప్రమత్తం చేస్తున్నారు.
చాలా మంది బీర్.. ఆల్కహాల్ కాదు.. మాకు మద్యం పై అవేర్ నెస్ ఉంది.. నిజంగా బీర్ ఆల్కహాలిక్ కాదు అనే అపోహతో , కొంతమంది కిడ్నీలో రాళ్లను తొలగించడంలో సహాయపడుతుందని కూడా నమ్ముతారు. అయితే ఇది నిజం కాదు. ఫరీదాబాద్ లోని అమృత హాస్పిటల్ లోని ఇంటర్నర్ మెడిసిన్ విభాగానికి చెందిన డాకస్టర్ సాక్షి సింగ్ అంటున్నారు. బీర్ లో తక్కువ ఆల్కహాల్ ఉంటుంది.. ఆల్కహాల్ ఏ మోతాదులో తీసుకున్నా ఆరోగ్యానికి హానికరమే అన్నారు.
బీర్ కిడ్నీలో రాళ్లను తొలగిస్తుందనే అవాస్తవం.. ఇది ఆల్కహాల్ సంబంధిత ఆరోగ్య సమస్యలకు దోహదం చేస్తుందన్నారు. హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల మూత్ర పిండాల్లో రాళ్లను నివారించడం సహాయ పడుతుందని నమ్ముతారు.. వాస్తవానికి ఇది డీ హైడ్రేషన్ కు దారి తీస్తుందంటున్నారు డాక్టర్లు. ఇది మూత్ర పిండాల్లో రాళ్ల సమస్యలను తీవ్రతరం చేస్తుందంటున్నారు.