పట్టపగలే దారుణం.. అందరూ చూస్తుండగానే.. కదులుతున్న బస్సులో అత్యంత పాశవిక దాడి.. ఒక్కసారిగా మీద పడ్డాడు.. తప్పించుకునే ఛాన్స్ ఇవ్వలేదు.. పదునైన కత్తితో కసితీరా పొడిచాడు.. రక్తం మడుగులో కండక్టర్.. క్షణాల్లో అంతా జరిగిపోయింది.. కేరళలో రన్నింగ్ లో ఉన్న బస్సులో కండక్టర్ ను దారుణంగా కత్తి పొడిచిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.
కేరళలోని కలమస్సేరిలో శనివారం పట్టపగలు కదులుతున్న బస్సుల్లో కండక్టర్ ను కత్తితో పొడిచి చంపాడు అగంతుడు. ఇడుక్కి లోని రాజకుమారికి చెందిన అనీష్ పీటర్ (34) బస్సు కండక్టర్ గా పనిచేస్తున్నాడు. హెచ్ ఎంటీ దగ్గరకు రాగానే గుర్తు తెలియని వ్యక్తి బస్సులోకి ఎక్కి అనీష్ పీటర్ ను దారుణంగా పొడిచి చంపాడు. ఈ ఘటన చేసిన ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళన గురయ్యారు. బస్సులోంచి కిందకు పరుగులు పెట్టారు.
ALSO READ | ఏటేటా పెరిగిపోతున్న విద్యార్థుల ఆత్మహత్యలు.. బయటపెట్టిన నివేదిక
శనివారం మధ్యాహ్నం 12 .30గంటలకు జరిగిన ఈ ఘటనలో బస్సు ఎక్కి అనీష్ తో తపపడిన దుండగులు.. నా సోదరిని ఆటపట్టిస్తావా.. నీ అంతు చూస్తా అని కత్తితో పొడిచి బస్సులోంచి పారిపోయాడు. ఘటనపై కలమస్సేరి పోలీసులు విచారణ చేపట్టారు. అనీష్ మృతదేహాన్ని పోస్టు మార్టమ్ కోసం కలమసేరి ప్రభుత్వ ఆస్పత్రికి తరిలించారు.