దున్నపోతులకు లిక్కర్.. సదర్ ఫెస్టివల్లో క్రేజీ బుల్స్..

సదర్ బలంగా ఉండాలని దున్నపోతులను కొద్ది నెలల ముందు నుంచే ప్రత్యేకంగా పెంచుతారు. దున్నపోతులకు రెండు పూట్ల 5 లీటర్ల చొప్పున పాలు తాగిస్తారు. బాదం, పిస్తా, కాజు, యాపిల్స్, అరటి పండ్లు, ఖర్జూరం, నెయ్యి, బెల్లం ఆహారంగా పెడతారు. రోజు రెండు లీటర్ల ఆవనూనెతో మసాజ్ చేస్తారు. వాకింగ్ చేయిస్తారు. షాంపూతో స్నానం చేయిస్తారు. వీటి కోసం | ప్రత్యేకమైన గది, పడుకోవటానికి మ్యాట్, గదిలో ఫ్యాన్ వంటి ఏర్పాట్లు కూడా చేస్తారు. మరికొందరు కోడిగుడ్లు, వారం వారం ఒక లీటరు లిక్కర్ కూడా వాటికి అందిస్తున్నట్లు సమాచారం. వాటికి పోషక కలిగిన తవుడు, దాన, గానుగ, పచ్చిగడ్డి, కుడితి వంటి పెడారు. దున్నపోతు బాడీపై ఉన్న వెంట్రుకలను తొలగించి వెన్న లేదా పెరుగు పెట్టి నల్లగా నిగనిగలాడేలా రెడీ చేస్తారు. మెడ చుటూ పూల దండలు, గజ్జలు కట్టి, కొమ్ములకు రంగురంగుల రిబ్బన్ల చుట్టి, నెమలి ఈకలు పెట్టి, సెంట్లు చల్లుతారు.

ALSO READ : హైదరాబాద్ కీ షాన్.. తెలంగాణలో మరో పండగ..సదర్ ఉత్సవం

సదరన్ ఫెస్టివల్ లో క్రేజీ బుల్స్

ఈ సారి సదర్ ఉత్సవాల్లో దున్నపోతులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నాయి. హర్యానా, గుజరాత్ రాష్ట్రాలను నుంచి వీటిని ప్రత్యేకంగా తెప్పించారు. ఈ బుల్స్ 1,800 కిలోల బరువు ఉందని, 7 అడుగుల ఎత్తు, ముక్కు నుంచి తోక వరకు 18 అడుగుల పొడవు ఉందని నిర్వాహకులు చెప్పారు. నేషల్ పోటీల్లో చాలా సార్లు చాంపియన్ గా నిలిచిన దున్నపోతులను ఇక్కడ ప్రదర్శించడం విశేషం. కొంతమంది ఈ దున్నపోతుల ధర రూ. 25 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఈ దున్నపోతులను పెంచడానికి రోజుకు 5 వేల నుంచి 10 వేల ఖర్చు చేస్తారని తెలుస్తోంది.