గుండెపోటుతో బుగ్గారం ఎంపీడీవో మృతి

జగిత్యాల టౌన్, వెలుగు : గుండెపోటుతో ఎంపీడీవో మృతిచెందారు. జగిత్యాల జిల్లా బుగ్గారం ఎంపీడీవో మాడిశెట్టి శ్రీనివాస్( 60) శనివారం రాత్రి కరీంనగర్ లోని ఇంట్లో గుండెపోటుతో చనిపోయారు. గత ఫిబ్రవరిలో బుగ్గారం ఎంపీడీవోగా బదిలీపై వచ్చారు.

విధి నిర్వహణలో శనివారం సాయంత్రం వరకు జగిత్యాలలో తోటి అధికారులు, సిబ్బందితో కలిసి విధులు నిర్వహించారు. ఆయన మృతితో ఉద్యోగులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీనివాస్ అంత్యక్రియలను ఆదివారం కుటుంబ సభ్యులు పూర్తి చేశారు.