బుగ్గరామలింగేశ్వర జాతరకు వేళాయే..నేటి నుంచి 15 రోజుల వరకు కొండకోనల్లో సందడి  

ఇబ్రహీంపట్నం, వెలుగు : రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలోని కొండకోనల్లో కొలువై ఉన్న బుగ్గరామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధమైంది. నేటి (కార్తీక పౌర్ణమి) నుంచి అమావాస్య వరకు15 రోజుల పాటు జాతర జరగనుంది. సిటీకి కూతవేటు దూరంలో ఉండడం, ఏటికేడు లక్షల్లో భక్తుల రద్దీ పెరుగుతుండడంతో ఆలయ కమిటీ అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసింది. ఇబ్రహీంపట్నం నుంచి జాతరకు ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

కాశీకి వెళ్లలేని వారు బుగ్గరామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. శ్రీరాముడు ఇక్కడ శివారాధన చేసినట్లు చరిత్ర చెబుతోంది. కార్తీక మాసంలో పెద్దసంఖ్యలో భక్తులు ఆలయానికి తరలించి వచ్చి, దీపారాధన చేసి మొక్కులు చెల్లించుకోనున్నారు.