తెలంగాణ బడ్జెట్ వాస్తవాల బడ్జెట్‌‌‌‌

 అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క  రూ.2,91,159 కోట్ల బడ్జెట్‌‌‌‌ ప్రతులను చదివి వినిపించారు.ఈ సందర్భంగా ‘బడ్జెట్‌‌‌‌ను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించామని, అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని  ప్రణాళికాబద్ధంగా ఆర్థిక క్రమశిక్షణతో కాంగ్రెన్‌‌‌‌ ప్రభుత్వం ముందుకు తీసుకువెళుతోంది' అని ఆర్థిక మంత్రి భట్టి చెప్పారు.  

బడ్జెట్‌‌‌‌లో  రైతులకు మేలు జరిగేలా నిధులు కేటాయించారు. గత ప్రభుత్వం తెలంగాణను ఇబ్బడిముబ్బడిగా దోచుకుని అప్పుల రాష్ట్రంగా మార్చేసింది. ఏ శాఖలో చూసినా అప్పుల లెక్కలే మిగిలాయి.  ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛన్‌‌‌‌దారులకు డబ్బులను చెల్లించలేని పరిస్థితికి తీసుకొచ్చారు.  సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రతినిధుల ఖర్చులను తగ్గించి, ప్రణాళికతో ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తున్నారు. గత  బీఆర్ఎస్​ ప్రభుత్వం చేసిన అప్పుల్లో కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం  రూ. 42వేల కోట్లు చెల్లించిందంటే ఎంతటి ఆర్థిక క్రమశిక్షణతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారో అర్థం చేసుకోవచ్చు. 

రాష్ట్రం ఏర్పడేనాటికి రూ. 75,577 వేల కోట్ల అప్పు ఉండగా కాంగ్రెస్‌‌‌‌ అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రం అప్పు మొత్తం రూ. 6,71,757 కోట్లు ఉన్నట్లు లెక్కల్లో తేలాయి. రాష్ట్ర  విభజన సమయంలో తెలంగాణ అప్పులు జీఎస్‌‌‌‌డీపీ ప్రకారం 14.4శాతం ఉండగా 2022–-2023 నాటికి  27.8 శాతానికి పెరిగింది.  అప్పులు చేయడమే అభివృద్ధి అన్నట్టు.. గత బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం పరిపాలన కొనసాగించింది. రాష్ట్ర అప్పులు పెరగడంతో ప్రస్తుతం కాంగ్రెస్‌‌‌‌ పరిపాలనలో వస్తున్న ఆదాయం చాలామేరకు అప్పుల చెల్లింపులకే సరిపోతోంది.  పరిమితికి మించి అప్పులు చేయడంతో రాష్ట్ర పురోగతికి ఆటంకం కలుగుతోంది. 

రుణమాఫీ చేసి చూపించారు

 రాష్ట్రవ్యాప్తంగా రైతులకు రూ. 31వేల కోట్లతో  ఏకకాలంలో రుణమాఫీకి చర్యలు చేపట్టింది. మొదటి దఫాగా లక్ష రూపాయలు రుణం కలిగిన రైతులకు రుణమాఫీ చేసింది.  మిగతావారికి కుటుంబం యూనిట్‌‌‌‌గా రూ. 2లక్షలు వరకూ చేయనుంది.  

దళితులను నిండా ముంచిన కేసీఆర్‌‌‌‌ 

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం మాత్రం ఎస్సీ, బీసీ సబ్‌‌‌‌ప్లాన్‌‌‌‌ నిధులను పక్కదారి పట్టించింది. ఎస్సీ యాక్షన్‌‌‌‌ ఫ్లాన్‌‌‌‌కి '0’ సున్నా నిధులను కేటాయించింది. 2014 నుంచి 2021 సంవత్సరం వరకూ అంటే పదేండ్ల కాలంలో ఎస్సీ కార్పొరేషన్‌‌‌‌కు కేవలం రూ.10,55,702  మాత్రమే కేటాయించిందంటే దళితుల అభివృద్ధిపై ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుసుకోవచ్చు.    ఎస్సీ సబ్‌‌‌‌ప్లాన్​కు 2019 నుంచి 2021 వరకు రూపాయి కూడా విడుదల చేయలేదు.  

బీసీ కార్పొరేషన్​ను నీరుగార్చారు

బీసీ కార్పొరేషన్‌‌‌‌కు కూడా నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేశారు.  స్వయం ఉపాధి కోసం 2014 నుంచి 2021 వరకూ 3,32,558 మంది దరఖాస్తు చేసుకోగా కేవలం 38,355 లబ్ధిదారులకు మాత్రమే లోన్లను మంజూరు చేసింది. 2019 నుంచి 2021 వరకూ బీసీ కార్పొరేషన్‌‌‌‌కు ఒక్క రూపాయి కూడా నిధులను మంజూరు చేయలేదు. 2014 నుంచి 2023 సంవత్సరాల్లో  బీసీ కార్పొరేషన్‌‌‌‌కు 8,61,420 అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వీరిలో కేవలం 82,902 మందికి మాత్రమే లోన్లు మంజూరయ్యాయి. 

బీసీ పథకాలకు ఎగనామం

రీడిజైన్‌‌‌‌ పేరిట ప్రాజెక్టులకు లక్షల కోట్లను కేటా యించి జేబులు నింపుకున్నారు. పేదల బతుకులు బాగుపడడానికి మాత్రం నిధులు కేటాయించలేదు. విదేశాలకు వెళ్లి ఉన్నత చదువుల చదివే విద్యార్థులకు సావిత్రిబాయి పూలే పథకం కింద సరైన న్యాయం చేయలేదు. ఫీజు రీయింబర్స్​మెంట్,  బీసీ స్కాలర్‌‌‌‌షిప్‌‌‌‌ నిధులను విడుదల చేయలేదు. ఇలా అన్ని రంగాల్లోనూ బీసీలకు గత ప్రభుత్వం అన్యాయం చేసింది.  బుడిమి కాయ దొంగ ఎవరంటే నేనుకాదు అన్నట్టు వాస్తవ లెక్కలను కాంగ్రెస్​ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు వివరిస్తుంటే ప్రభుత్వంపై  చిల్లరమల్లర మాటలతో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నాయకులు విరుచుకుపడడం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. 

బాధితులకు సీఎంఆర్ఎఫ్​ నిధులు

గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌‌‌‌ను అందజేస్తోంది. 45,92,824 లక్షల మంది గృహ విద్యుత్​ వినియోగదారులకు లబ్ధి చేకూరుతుంది. పేద ప్రజల సీఎంఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌  నిధులను  వెనువెంటనే విడుదల చేస్తోంది. ఖరీఫ్‌‌‌‌ కంటే ముందుగానే రైతుల ఖాతాల్లో రైతు భరోసా కింద 69,86,519 మంది రైతులకు రూ.7,625 కోట్లను విడుదల చేసింది. 

అంచనాలకు. వాస్తవానికి మధ్య వ్యత్యాసం

గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌‌‌‌ అంచనాలకు.. చేసిన ఖర్చుకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. పదేండ్లలో సరాసరి 17శాతం పైగా వ్యత్యాసం ఉంది. ఎన్నడూ  రాష్ట్ర ప్రజల అవసరాలు, ఆర్థికాభివృద్ధి  చెందేలా బడ్జెట్​ను  రూపొందించలేదు.  కమీషన్‌‌‌‌ వచ్చే వాటికి ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించి  కేసీఆర్​ కుటుంబ సభ్యులు జేబులు నింపుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌ రాష్ట్ర ప్రజలకు చేసిన పాపాలను ఒక్కొక్కటిగా సరిచేస్తూ,  రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్‌‌‌‌ న్యాయం చేస్తోంది.  రైతులు, మహిళలు, చిరుద్యోగులు, భూమిలేని కౌలు రైతులు ఇలా రాష్ట్రంలోని పేద ప్రజలను ఆర్థికాభివృద్ధి వైవు పయనించేలా రాష్ట్ర బడ్జెట్‌‌‌‌ను రూపొందించారు.

 

- ఇందిరా శోభన్‌‌‌‌,
రాష్ట్ర కాంగ్రెస్‌‌‌‌
సీనియర్‌‌‌‌ నాయకురాలు