బుద్ధవనం అద్భుత బౌద్ధ వారసత్వ ప్రదర్శనశాల

హాలియా, వెలుగు : నాగార్జునసాగర్ లో నిర్మించిన బుద్ధవనం అద్భుత బౌద్ధ వారసత్వ ప్రదర్శనశాల అని అంతర్జాతీయ హార్ట్ ఫుల్ నెస్ మార్గదర్శి దాజి కమలేశ్ పటేల్ అన్నారు. శుక్రవారం నాగార్జునసాగర్​బుద్ధవనాన్ని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.ప్రకాశ్ రెడ్డితో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా బుద్ధవనంలోని మహాస్తూపం లోపల బుద్ధుని పరమపవిత్రమైన దాతుపేటికలు, బౌద్ధాలయాన్ని పరిశీలించారు. 

బుద్ధవనంలోని ప్రధాన ఆకర్షణలైన బుద్ధ చరితవనం, జాతకవనం, ధ్యానవనం, 27 అడుగుల శ్రీలంక అవకన బుద్ధప్రతిమ, స్తూపవనాల అంశాలపై ఆయనకు బుద్ధిష్ట్ ఎక్స్​ఫర్ట్​కన్సల్టెంట్ డాక్టర్ శివనాగిరెడ్డి వివరించారు. వారి వెంట జెన్కో సీఎండీ రోనాల్డ్ రోస్ , ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ విశాలాక్షి, మాజీ నీటివనరుల సంస్థ చైర్మన్ వి.ప్రకాశ్, బయో జెన్ కేర్ డైరెక్టర్ పార్థసారథి, బుద్ధవనం అధికారి సుధన్ రెడ్డి, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు, డిజైన్ ఇన్​చార్జి శ్యాంసుందర్​రావు తదితరులు ఉన్నారు.