Buchi Babu Tournament 2024: బుచ్చిబాబు టోర్నీ విజేత హైదరాబాద్‌

  • చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ఆలిండియా బుచ్చిబాబు ట్రోఫీ సొంతం
  • ఫైనల్లో 243 రన్స్ తేడాతో చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై గ్రాండ్ విక్టరీ 

హైదరాబాద్, వెలుగు:  ఆలిండియా బుచ్చిబాబు ఇన్విటేషనల్ క్రికెట్ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచింది. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏ) నిర్వహించే ఈ మెగా టోర్నీలో ఏడేండ్ల విరామం తర్వాత మళ్లీ ట్రోఫీ గెలుచుకుంది. దుండిగుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బుధవారం ముగిసిన ఫైనల్లో రాహుల్ సింగ్ కెప్టెన్సీలోని హైదరాబాద్ 243 రన్స్ తేడాతో  చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఘన విజయం సాధించింది.  ఈ టోర్నీలో  ఆరంభం నుంచి అదరగొట్టిన హైదరాబాద్ ఫైనల్లో మరింత విజృంభించింది. రోహిత్ రాయుడు (155) భారీ సెంచరీతో సత్తా చాటడంతో తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 417 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. అనంతరం అనికేత్ రెడ్డి (4/56) నాలుగు, రోహిత్ రాయుడు (3/36) మూడు వికెట్లు పడగొట్టడంతో  చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 181 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాహుల్ సింగ్ (68) రాణించడంతో  హైదరాబాద్ 70.2 ఓవర్లలో 281 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద ఆలౌటై ప్రత్యర్థి ముందు 518 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టార్గెట్ ఉంచింది.  ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  61.1 ఓవర్లలో 274 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే కుప్పకూలింది. ఆయుష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాండే (117) సెంచరీ చేసినా జట్టును  ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. 

హైదరాబాద్ బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ (5/60) ఐదు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు.  ట్రోఫీతో పాటు హైదరాబాద్ రూ. 3 లక్షల ప్రైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మనీ అందుకుంది. చివరగా 2017లో హైదరాబాద్ ఈ టోర్నీలో విజేతగా నిలిచింది. విన్నింగ్ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మోహన్ రావు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ ఆటగాళ్లను ఘనంగా సన్మానించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు.