BSNL New year plan : 120 GB @ Rs. 277.. 60 రోజులు వ్యాలిడిటీ..

కొత్త సంవత్సరం సందర్భంగా BSNL టెలికాం సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. కేవలం 277 రూపాయిలకే 60 రోజుల వ్యాలిడిటీతో 120 GB అన్  లిమిటెడ్ కాల్స్ ను ప్రకటించింది. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ కంపెనీలు తమ రీఛార్జ్ ధరలను పెంచడంతో లక్షలాది మంది ప్రజలు BSNL వైపు మొగ్గు చూపుతున్నారు. కొత్త సంవత్సరం 2025 కోసం, BSNL పాకెట్-ఫ్రెండ్లీ ప్లాన్‌ను రూ. రూ. 277. భారీ ఇంటర్నెట్ వినియోగదారులకు మరియు చెల్లుబాటు పొడిగింపు కోసం చూస్తున్న వారికి ఈ ప్లాన్ ఉత్తమమైనది.

అపరిమిత కాల్స్

ఈ ప్లాన్ 120GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ లో  రోజువారీ 2GB డేటాను పొందవచ్చు.  రెండు నెలల వాలిడిటీ ఉంటుంది. . జనవరి 16లోపు రీఛార్జ్ చేసుకునే వారికి ఈ ప్లాన్ అందుబాటులోకి రానుంది. మోర్ డేటా, మోర్ ఫన్ ... పేరుతో బీఎస్ఎన్ఎల్ ఈ కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. 

BSNL తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్ జనవరి 16, 2025 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది.. న్యూ ఇయర్ సందర్బంగా ఈ ప్రత్యేక ప్లాన్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్ వేదికగా ఓ ట్వీట్ చేసింది బీఎస్ఎన్ఎల్.

5G నెట్‌వర్క్ కోసం ప్రయత్నాలు

 BSNL తన 4G నెట్‌వర్క్‌ను మరింత విస్తరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే 60 వేలకు  పైగా 4G టవర్లు ఉన్నాయి, ఇప్పటికే లక్షలాది మంది తమ సిమ్ కార్డులను ప్రైవేట్ కంపెనీల నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్ చేశారు. . ప్రతి నెలా ప్రభుత్వ నెట్‌వర్క్‌కి మారుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికీ 5జీ కేటగిరీలో జియోనే కస్టమర్లను ఆకర్షించడంలో టాప్‌లో కొనసాగుతోంది.

 బీఎస్‌ఎన్ఎల్ సిగ్నల్ సరిగా రావట్లేదని, డేటా స్పీడ్ చాలా స్లోగా ఉందనే ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ క్రమంలో కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త కొత్త ప్లాన్లు తీసుకొస్తోంది.