BSNL Layoffs:బీఎస్ఎన్ఎల్ సంచలన నిర్ణయం..19వేల మంది ఉద్యోగుల తొలగింపు

ప్రభుత్వ రంగ టెలికం ఆపరేటర్ BSNL సంచలన నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు వాలంటరీ రిటైర్మెంట్ ప్లాన్ 2.0 ప్రతిపాదించింది. కంపెనీ నిర్వహణ ఖర్చులను తగ్గించుకునే ప్రణాళికలో భాగంగా  బీఎస్ ఎన్ ఎల్.. వేలమంది ఉద్యోగులను తొలగించనుంది. కంపెనీ లేఆఫ్స్ ప్రకటనతో దాదాపు 19వేల మంది బీఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులపై ప్రభావం చూపనుంది.

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL)  కంపెనీ నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకునే క్రమంలో టెలికమ్యూనికేషన్ డిపార్టుమెంట్ లో కొత్త  వాలంటరీ రిటైర్మెంట్ ప్లాన్ ను ప్రతిపాదించింది.  ఇందుకోసం రూ. 1500 కోట్లను ఆమోదించాలని BSNL అధికారులను కోరింది.

మరో వైపు బీఎస్ ఎన్ ఎల్ కంపెనీ నెమ్మదిగా తన  నెట్ వర్క్ విస్తరణ కొనసాగిస్తోంది.. దేశవ్యాప్తంగా 4G, 5G సేవలను క్రమంగా విస్తరిస్తోంది.. దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాలు , గ్రామాల్లో నెట్ వర్క్ ను పెంచుతోంది. 

Also Read :- స్పెషల్ కెమెరా డిజైన్‌తో అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్

బీఎస్ ఎన్ ఎల్ తాజా నిర్ణయంతో వేతన బిల్లులు తగ్గించుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇందుల్లో వీఆర్ ఎస్ ప్రకటించింది. దీంతో 18వేల నుంచి 19 వేల ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. బీఎస్ ఎన్ ఎల్ ఉద్యోగుల తొలగింపుతో  ప్రభుత్వ రంగ సంస్థ 38 శాతం ఖర్చులు తగ్గనున్నాయి. 

ప్రస్తుతం ప్రభుత్వ రంగం టెలికం సంస్థ బీఎస్ ఎన్ ఎల్  ఇప్పటి వరకు తన ఉద్యోగులకు 7500 కోట్ల వేతనాలు చెల్లిస్తోంది.. ఉద్యోగుల వీఆర్ ఎస్ ప్రతిపాదనతో సంవత్సరానికి 5వేల కోట్లు వేతన భారం తగ్గించుకోనుంది. ఈ ప్రతిపాదనకు సంబంధించి టెలికం కమ్యూనికేషన్ శాఖకు ఉద్యోగుల లేఆఫ్స్ రిక్వెస్ట్ దాఖలు చేసింది. అయితే బీఎస్ ఎన్ ఎల్ రిక్వెస్ట్ ను కేంద్ర కేబినెట్, ఫైనాన్స్ మినిస్ట్రీ అప్రూవల్ చేయాల్సి ఉంది.