గుడ్ న్యూస్: BSNL సర్వత్ర సరికొత్త టెక్నాలజీ..మారుమూల గ్రామాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్

టెలికం ఇండస్ట్రీలో BSNL దూసుకుపోతోంది. తన కస్టమర్లకు మెరుగైన సేవలందించేందుకు కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటోంది. సుదూర ప్రాంతాల వినియోగదారులకు కూడా హోమ్ ఫైబర్ ద్వారా హైస్పీడ్ ఇంటర్నెట్ ఆస్వాదించేందుకు కృషి చేస్తోంది. 

రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్ వంటి ప్రధాన ప్రైవేట్ టెలికాం ప్రొవైడర్లు ఇప్పటికే తమ టెలికాం, ఫైబర్ వినియోగదారులకు హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను అందిస్తున్నాయి. ఈ టెలికం ప్రొవైడర్లకు పోటీగా BSNL 'సర్వత్ర' టెక్నాలజీ పరిశ్రమలో విప్లవాన్ని తీసుకువస్తుందని భావిస్తున్నారు.

తాజాగా కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెస్తోంది బీఎస్ఎన్ఎల్. సర్వత్ర అనే పేరుతో లేటెస్ట్ టెక్నాలజీని తీసుకురానుంది. రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్ వంటి ప్రధాన ప్రైవేట్ టెలికాం ప్రొవైడర్లు ఇప్పటికే తమ టెలికాం, ఫైబర్ వినియోగదారులకు హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను అందిస్తున్నాయి. 

ALSO READ | Jio Prepaid Plans: జియో రూ. 249 vs రూ. 299.. ఏ రీఛార్జ్ ప్లాన్ బెటర్..?

ఈ టెలికం ప్రొవైడర్లకు పోటీగా BSNL సర్వత్ర..టెలికాం పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని టెక్ నిపుణులు అంటున్నారు. BSNL కస్టమర్లు కొత్త టెక్నాలజీకి దూరంగా ఉన్నప్పటికీ వారి హోమ్ ఫైబర్ కనెక్షన్ల ద్వారా హై-స్పీడ్ ఇంటర్నెట్ ప్రయోజనాలను పొందేలా చేస్తుంది.

ప్రాజెక్టు ట్రయల్ దశ ఇప్పటికే పూర్తయింది. కేరళతో  సహా వివిధ ప్రాంతాల్లో ఈ కొత్త టెక్నాలజీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. భారతదేశంలోని మారుమూల గ్రామాలకు సైతం హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని విస్తరించడమే ఈచొరవ లక్ష్యం. 

BSNL సర్వత్ర ఎలా పనిచేస్తుందంటే..

BSNL సర్వత్ర..ఇది ఫైబర్ టు ది హోమ్ (FTTH) టెక్నాలజీతో వస్తుంది. ఇది ఇప్పటికే  ఇల్లు, ఆఫీసుల్లో FTTH కనెక్షన్ కలిగి ఉన్న వినియోగదారులకు ఇతర ప్రదేశాల నుంచి ఇంటర్నెట్ యాక్సె స్ కు అనుతిస్తుంది. ఈఫీచర్ ను వినియోగించుకోవాలంటే.. తప్పనిసరిగా సర్వత్ర పథకం కింద నమోదు చేసుకోవాలి. సర్వత్రా పోర్టల్ వర్చువల్ టవర్ లాగా పనిచేస్తుంది.. కనెక్టివిటీకి భరోసా కల్పిస్తుంది.