BSNL 4G: ఆన్లైన్లో బీఎస్ఎన్ఎల్ ఫ్యాన్సీ నంబర్స్.. కావాలంటే ఇలా చేయండి

ఇటీవల దేశంలోని ప్రముఖ టెలికం ఆపరేటర్లు మొత్తం వాటి రీచార్జ్ ధరలు పెంచిన విషయం తెలిసిందే.. ఎయిర్ టెల్, జియో, వొడాఫోన్ ఐడియా వంటి టెలికం సంస్థలు రీచార్జ్  ప్లాన్ల ధరలు అమాంతం పెంచేయడంతో కస్టమర్లు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. అందులో భాగంగానే BSNL నెట్ వర్క్ వైపు మొగ్గు చూపుతున్నారు. 

BSNL కూడ తక్కువ ధరల్లో రీచార్జ్ ప్లాన్లను అందిస్తోంది. ఈ కారణంగానే ఇతర టెలికం సంస్థలకు చెందిన సబ్ స్క్రైబర్లు.. బీఎస్ ఎన్ఎల్ నెట్ వర్క్ కు మారుతున్నారు.  ఈ క్రమంలో BSNL దేశవ్యాప్తంగా 4G  సేవలను విస్తరించింది. దేశంలోని మొత్తం 1000కి పైగా ప్రాంతాల్లో 4G సేవలను అందిస్తోంది. 

ఇతర టెలికం కంపెనీల సబ్ స్క్రైబర్లు .. బీఎస్ ఎన్ ఎల్ నెట్ వర్క్ వైపు వస్తుండటంతో కంపెనీ 4 G సిమ్ ల అమ్మకాల్లో మంచి ఆఫర్లు అందిస్తోంది. ఎవరైతే బీఎస్ ఎన్ ఎల్ సిమ్ తీసుకోవాలని కోరుకుంటారో వారికి ప్రత్యేకంగా వారు ఎంచుకున్న నంబర్లను  ఆన్ లైన్ అందిస్తోంది. బీఎస్ ఎన్ ఎల్ ఫ్యాన్సీ మొబైల్ నంబర్ ను ఎలా పొందవచ్చో తెలుకుందాం.. 

BSNL ఫ్యాన్సీ మొబైల్ నంబర్ పొందండి ఇలా.. 

  • మొదట గూగుల్ సెర్చ్ లో BSNL Choose Your Mobile Number  అని సెర్చ్ చేయాలి. 

  • cymn link పై క్లిక్ చేయాలి. 

  • తర్వాత జోన్ ను సెలక్ట్ చేసుకోవాలి

  • తర్వాత మీ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాలి 

  • స్క్రీన్ పై Preferred numbers with Siries, Start Number, End number, sum of numbers ఆప్షన్లు కనిపిస్తాయి. 

  • మీ ఫ్యాన్సీ నంబర్ ను సెలక్ట్ చేసుకున్న తరువాత Reserve Number పై క్లిక చేయడం ద్వారా సెలెక్టెడ్ నంబర్ ను రిజర్వ్ చేసుకోవచ్చు. 

  • తర్వాత మీ ప్రస్తుత మొబైల్ నంబర్ ను ఎంటర్ చేయాలి.. ఓటీపీ వస్తుంది ఎంటర్ చేయాలి.. 

  • దీంతో మీ ఫ్యాన్సీ నంబర్ రిజర్వ్  అయిపోతుంది. 

  • తర్వాత మీ దగ్గరలో ఉన్న BSNL ఆఫీసుకు వెళ్లి BSNL SIM ని పొందవచ్చు.