కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేసీఆర్ కటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు క్షీరాభిషేకం

తిమ్మాపూర్, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దీక్షా దివస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాజరయ్యారు. ఆయనకు తిమ్మాపూర్​ మండలం అల్గునూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. అంతకుముందు ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీలోని అమరవీరుల స్తూపానికి నివాళుర్పించారు. అక్కడి నుంచి శ్రేణులతో కలిసి అల్గునూర్ చౌరస్తా దాకా బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ర్యాలీ నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన కేసీఆర్ కటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కేటీఆర్ క్షీరాభిషేకం చేశారు. అనంతరం కార్యకర్తలతో కలిసి సభా ప్రాంగణానికి వెళ్లారు. 

దీక్షాదివస్ సభలో రసమయి రుసరుస 

దీక్షా దివస్ సభా వేదికపై బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పదేళ్ల పాలనపై ఎమ్మెల్యే గంగుల ఆధ్వర్యంలో డాక్యుమెంటరీ ప్రదర్శించారు. అనంతరం సభ ప్రారంభమైంది. కాగా అప్పటికే సెకండ్ క్యాడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్లు, కార్యకర్తలు సభా వేదిక నిండిపోయింది. దీంతో మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి వారిని చూసి రుసరుసలాడారు. వేదికపై ఎక్కువ మంది కరీంనగర్ వాళ్లే ఉండడంతో..  మేయర్, డిప్యూటీ మేయర్ మినహా మిగతా వాళ్లంతా వెంటనే వేదిక దిగిపోవాలన్నారు. కరీంనగర్ వాళ్లతో కలవమని అసహనం వ్యక్తం చేశారు.