బీజేపీలో చేరికలు

పిట్లం, వెలుగు : పిట్లం మండలం అన్నారం మాజీ సర్పంచ్​ కాశీరాం, బీఆర్​ఎస్​ కార్యకర్తలు బీజేపీలో జాయిన్ అయ్యారు.  శనివారం సంగారెడ్డి జిల్లా టేక్మల్​లో ఎంపీ బీబీ పాటిల్​ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.  ఈ సందర్భంగా బీబీ పాటిల్ మాట్లాడుతూ..  తెలంగాణలో,  దేశంలో బీజేపీ విజయం సాధించబోతుందని

ధీమా వ్యక్తం చేశారు.  వివిధ పార్టీల నాయకులు తమ విధానాలు నచ్చి బీజేపీలో చేరుతున్నారని పేర్కొన్నారు.  ఎంపీగా గెలిపిస్తే జహీరాబాద్‌ను మరింత అభివృద్ధి చేస్తానని ప్రకటించారు పిట్లం మండల పార్టీ అధ్యక్షుడు అభినయ్​రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.