బీజేపీలో చేరిన బీఆర్‌‌ఎస్ ఎంపీటీసీ

ఎడపల్లి, వెలుగు: ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ బీఆర్ఎస్​ ఎంపీటీసీ, ఆ పార్టీ మండల కార్యదర్శి, మంద సంజీవ్​ఆదివారం బీఆర్‌‌ఎస్ ను వీడి బీజేపీలో జాయిన్ అయ్యారు.  నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్ సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు.  బీజేపీ టికెట్‌ పై ఎంపీటీసీగా గెలిచిన మంద సంజీవ్ అనంతరం బీఆర్‌‌ఎస్ పార్టీలో చేరారు.  బీఆర్‌‌ఎస్ అధికారం కోల్పోగానే తిరిగి ఆయన బీజేపీ లో చేరారు. పార్లమెంట్​ ఎన్నికల నేపథ్యంలో  పార్టీలో తిరిగి చేరాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్​ రెడ్డి, మేడపాటి ప్రకాశ్​ రెడ్డి కోరడంతో మంద సంజీవ్​ బీజేపీలో చేరారన్నారు కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఇంద్రకరణ్, మహేశ్​ గౌడ్​, చిలుక ప్రవీణ్​ తదితరులున్నారు.