బతుకమ్మ, తెలంగాణ తల్లిని దూరం చేస్తున్నారు: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల నుంచి బతుకమ్మ, తెలంగాణ తల్లిని దూరం చేయాలనే కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మె ల్సీ కవిత అన్నారు. ఇవాళ జగిత్యాలకు వచ్చిన కవితకు ధరూర్ బైపాస్ వద్ద గజమాలతో ఘన స్వాగతం పలికారు. పెద్దసంఖ్యలో మహిళలు, కార్యకర్తలు తరలి వచ్చారు. బైపాస్ వద్ద ఉన్న అంబేడ్క ర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించా రు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి కవిత బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత.. జగిత్యాల అంటేనే బీఆర్ఎస్ అడ్డా అని మీ అందర్నీ చూస్తే తెలిసిపోతుందన్నారు.

ALSO READ | అప్పులపై కాంగ్రెస్ దగ్గర పక్కా లెక్కలున్నాయ్ : భట్టి విక్రమార్క

 కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ లేకపోవడంపై మహిళలు మండిపడుతున్నారని తెలిపారు. ' ఇక్కడ మీరు గెలిపించిన నాయకుడు పార్టీకి ద్రోహం చేసిన వెళ్లిపోయాడు. కేసీఆర్ బొమ్మ పెట్టుకొని గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ అసెంబ్లీకి వెళ్ళి ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతాడో చూద్దాం. జగిత్యాలకి ఒక్క రూపాయి రాలేదు, జగిత్యాలలో అభివృద్ధి ఏమీ జరగలేదు. పైసల కోసం సంజయ్ పార్టీ మారాడు. పైసలా కోసం పార్టీ మారిన వ్యక్తులు నాయకులే కాదు. మిమ్మల్ని చూస్తే అర్థం అవుతుంది మీలో ఒకరు ఎమ్మెల్యే అవుతారు. కేసీఆర్కు సైనికులుగా మీరంతా ఉన్నారు. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే. అధికారం కోసం కాంగ్రెస్ నేతలు ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ, ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు' అని కవిత అన్నారు.