కరీంనగర్‌‌‌‌ జిల్లావ్యాప్తంగా రుణమాఫీపై బీఆర్‌‌‌‌ఎస్‌‌ లీడర్ల ధర్నా

నెట్‌‌వర్క్‌‌, వెలుగు : రుణమాఫీ విషయంలో ఆంక్షలు విధిస్తూ కాంగ్రెస్‌‌ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని బీఆర్‌‌‌‌ఎస్‌‌ లీడర్లు ఆరోపించారు. బీఆర్‌‌‌‌ఎస్ హైకమాండ్ పిలుపుమేరకు ఉమ్మడి కరీంనగర్‌‌‌‌ జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు గురువారం నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మలు దహనం చేశారు. కరీంనగర్‌‌‌‌ కలెక్టరేట్‌‌ ఎదుట,  మానకొండూర్‌‌‌‌లో మాజీ ఎంపీ బి.వినోద్‌‌కుమార్‌‌‌‌ నిరసనలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌‌ ప్రభుత్వం రుణమాఫీ పేరిట మోసం చేసిందన్నారు. కోరుట్లలో ఎమ్మెల్యే సంజయ్‌‌ ఆధ్వర్యంలో హైవేపై రాస్తారోకో నిర్వహించారు. వేములవాడలో చల్మెడ లక్ష్మీనరసింహారావు, జడ్పీ మాజీ చైర్‌‌‌‌పర్సన్‌‌ తుల ఉమ, ఏనుగు మనోహర్‌‌‌‌రెడ్డి ఆధ్వర్యంలో, చొప్పదండిలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, సైదాపూర్‌‌‌‌, చిగురుమామిడి, రామడుగు, మల్యాలలో ధర్నాకు దిగారు.