కేసీఆర్​ను కలిసిన బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ నాయకులు

కామారెడ్డి, వెలుగు : ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాకు చెందిన బీఆర్​ఎస్​ నేతలు శుక్రవారం బీఆర్​ఎస్​ పార్టీ చీఫ్​ కేసీఆర్​ను ఎర్రవెల్లిలోని ఫామ్​హౌజ్​లో కలిశారు.  జిల్లాలో పార్టీ పరిస్థితులపై చర్చించారు. ఇటీవల బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి కాంగ్రెస్​లో  చేరిన తర్వాత వీరు కేసీఆర్​ను కలిశారు.  

బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రశాంత్​రెడ్డి,  మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్​, హన్మంతు షిండే,  జీవన్​రెడ్డి, జాజాల సురేందర్ ఉన్నారు.