కాంగ్రెస్‌‌లో చేరిన బీఆర్‌‌‌‌ఎస్‌‌ లీడర్‌‌‌‌

వేములవాడరూరల్, వెలుగు : వేములవాడ మండలం వట్టెంల గ్రామానికి చెందిన బీఆర్ఎస్‌‌ సోషల్‌‌ మీడియా రూరల్ మండల ఇన్‌‌చార్జి ముష్కం శ్రీనివాస్‌‌ సోమవారం కాంగ్రెస్‌‌లో చేరారు. ఆయనకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతోపాటు మాజీ ఎంపీపీ రంగు వెంకటేశ్‌‌ గౌడ్‌‌, పొన్నం సత్యం, గంగాసాగర్, రాజేంద్రప్రసాద్ ఉన్నారు.