బీఆర్ఎస్ తెలంగాణను అప్పుల పాలు చేసింది: MP వంశీకృష్ణ

గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల పాలు చేసిందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేసిందని అన్నారు. 8 వేల కోట్లతో రామగుండం జెన్కోలో సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం సంతోషం గా ఉందన్నారు. ఈ ప్లాంట్ ఏర్పాటుతో సుమారుగా 2వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ప్లాంట్ నిర్మాణం కోసం నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో నూతన రైల్వే లైన్ ఏర్పాటు కృషి చేస్తామని పేర్కొన్నారు. అలాగే కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి ఇటీవల పార్లమెంట్ మాట్లాడినట్లు ఆయన గుర్తు చేశారు.  

Also Read :- హైడ్రా ఎఫెక్ట్.. ఆరుగురు అధికారులపై కేసులు నమోదు