బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లో.. గ్రాడ్యుయేట్‌‌‌‌‌‌‌‌ వార్‌‌‌‌‌‌‌‌

  •     ఎమ్మెల్యేలు గుంటకండ్ల జగదీశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి మధ్య రాజకీయ విభేదాలు
  •     పల్లా బరిలో ఉన్నప్పుడే సపోర్ట్​ చేయని జగదీశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి వర్గం
  •     ఇప్పుడు పల్లా అనుచరుడికే టికెట్‌‌‌‌‌‌‌‌ దక్కడంతో అసంతృప్తిలో లీడర్లు
  •     గ్రాడ్యుయేట్‌‌‌‌‌‌‌‌ బైపోల్‌‌‌‌‌‌‌‌లో ప్రతికూల ప్రభావం చూపే ఛాన్స్‌‌‌‌‌‌‌‌

నల్గొండ, వెలుగు : బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యేలు గుంటకండ్ల జగదీశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌రెడ్డి మధ్య ఉన్న విభేదాలు నల్గొండ, ఖమ్మం, వరంగల్‌‌‌‌‌‌‌‌ గ్రాడ్యుయేట్‌‌‌‌‌‌‌‌ ఉపఎన్నిక టైంలో మరోసారి తెరపైకి వచ్చాయి. 2021లో జరిగిన గ్రాడ్యుయేట్‌‌‌‌‌‌‌‌ ఎన్నికల్లో రెండోసారి బరిలో నిలిచిన పల్లాకు గుంటకండ్ల వర్గ నాయకులు కనీస సహకారం అందించలేదు. దీంతో ఆయన తన సొంతంగా తన టీమ్స్‌‌‌‌‌‌‌‌ను రంగంలోకి దించడంతో ఎట్టకేలకు విజయం సాధించారు. పల్లా రాజీనామా కారణంగా జరుగుతున్న ఉప ఎన్నికలోనూ ఆయన అనుచరుడు రాకేశ్‌‌‌‌‌‌‌‌రెడ్డికి టికెట్‌‌‌‌‌‌‌‌ ఇవ్వడంతో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పల్లాకు సహరించని అప్పటి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యేలు

2 015లో గ్రాడ్యుయేట్‌‌‌‌‌‌‌‌ కోటాలో తొలిసారి ఎమ్మెల్సీగా గెలిచిన పల్లా ఏనాడు నిరుద్యోగులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌, అవుట్‌‌‌‌‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగుల సమస్యల గురించి పట్టించుకోలేదు. మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ వెన్నంటే నడిచిన ఆయన పార్టీ వ్యవహారాలు చక్కబెట్టేందుకే పూర్తి కాలాన్ని వాడుకున్నారు. ఈ ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌ 2021 గ్రాడ్యుయేట్‌‌‌‌‌‌‌‌ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపింది.  ఆ ఎన్నికల్లో పల్లా అభ్యర్థిత్వం పట్ల పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

ముఖ్యంగా నల్గొండ జిల్లాలో మాజీమంత్రి గుంటకండ్ల జగదీశ్‌‌‌‌‌‌‌‌రెడ్డితో రాజకీయంగా ఉన్న విభేదాలు అప్పటి ఎన్నికల్లో స్పష్టంగా కనిపించాయి. జగదీశ్‌‌‌‌‌‌‌‌ రెడ్డి వర్గానికి చెందిన అప్పటి ఎమ్మెల్యేలు పల్లాకు సహకరించలేదు. దీంతో ఎన్నికల్లో గట్టెక్కేందుకు రాజేశ్వరరెడ్డి సొంత టీమ్స్‌‌‌‌‌‌‌‌ను రంగంలోకి దింపారు. పల్లా కాలేజీలకు చెందిన ఉద్యోగులు, స్టాఫ్‌‌‌‌‌‌‌‌ ఏకమై భారీగా ఓట్లునమోదు చేయించారు. తన టీమ్స్‌‌‌‌‌‌‌‌తో గ్రామ స్థాయి నుంచి పట్టణ ఓటర్ల వరకు కలిసి ప్రలోభాలకు గురిచేశారు.

 ప్రచారంలో భాగంగా ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, నిరుద్యోగులు, ప్రైవేట్‌‌‌‌‌‌‌‌, ప్రభుత్వ టీచర్లు, యూనియన్‌‌‌‌‌‌‌‌ లీడర్లతో వేర్వురుగా ఆత్మీయ సమ్మేళనాల పేరుతో దావత్‌‌‌‌‌‌‌‌లు ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గానికి కనీసం రూ.50 లక్షల వరకు ఖర్చు పెట్టారని ప్రచారం జరిగింది. పోలింగ్‌‌‌‌‌‌‌‌ జరిగే చివరి రోజు వరకూ ఓటర్లకు రూ. మూడు వేల చొప్పున పంపిణీ చేశారు.

ఎమ్మెల్యేల మీద నమ్మకం లేక, తన సొంత టీమ్స్‌‌‌‌‌‌‌‌తోనే పోల్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ చేయించారు. ఇప్పుడు మళ్లీ ఆయన అనుచరుడు ఏనుగు రాకేశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి బైపోల్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌గా పోటీ చేయడంతో మాజీ ఎమ్మెల్యేలు మరింత గుర్రుగా ఉన్నారు. 

నల్గొండలో జగదీశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి వర్గం దూరం

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆదివారం నుంచి రాకేశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రచారం మొదలు కానుంది. కానీ రాకేశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి బాధ్యత పల్లాకు అప్పగించడంతో మాజీలు ఎవరూ సహరించే పరిస్థితి కనిపించడం లేదు. మాజీ మంత్రి జగదీశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఎప్పటినుంచో రాజకీయంగా విభేదాలు ఉన్నాయి. నల్గొండ జిల్లా రాజకీయాల్లో పల్లా తలదూర్చడాన్ని జగదీశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి వర్గం జీర్ణించుకోలేకపోతోంది. పైగా డబ్బులు లేకపోవడంతో మాజీలు ఎంపీ ఎన్నికల్లో చేతులెత్తేశారు.

బూత్‌‌‌‌‌‌‌‌ ఖర్చులకు కూడా పైసలు ఇవ్వకపోవడంతో పార్టీ తరఫున ఏజెంట్లుగా ఉండేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఓటర్లు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌, బీజేపీ వైపు మొగ్గు చూపారని మాజీ ఎమ్మెల్యేలే ఒప్పుకుంటున్నారు. వీళ్లలో నిరుద్యోగులు, ఉద్యోగులు, గ్రాడ్యుయేట్లు, కొత్త ఓటర్లు చాలా మంది ఉన్నారు. 4.63 లక్షల మంది ఉన్న గ్రాడ్యుయేట్‌‌‌‌‌‌‌‌ ఓటర్లు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ వైపు వస్తారని పార్టీ లీడర్లకు నమ్మకం కలగడం లేదు.

నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్న కృష్ణారెడ్డి ఎంపీగా పోటీ చేస్తేనే ఆయన తరఫున భూపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి కనీస ప్రచారం చేయలేదు. ఈ పరిస్థితుల్లో రాకేశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి తరఫున జగదీశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి వర్గం ప్రచారం చేస్తుందన్న నమ్మకం లేదని సీనియర్‌‌‌‌‌‌‌‌ నేత ఒకరు ‘వెలుగు’తో చెప్పారు. నకిరేకల్, కోదాడ, హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, నాగార్జునసాగర్, దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు పూర్తిగా చేతులెత్తేశారు.

నామ్‌‌‌‌‌‌‌‌ కే వాస్తే అన్నట్టుగా పార్టీ శ్రేణులతో గ్రాడ్యుయేట్‌‌‌‌‌‌‌‌ ఎన్నికల సన్నాహక సమావేశాలు ప్లాన్‌‌‌‌‌‌‌‌ చేశారని, బైపోల్‌‌‌‌‌‌‌‌లో సిట్టింగ్‌‌‌‌‌‌‌‌ స్థానాన్ని తిరిగి దక్కించుకోవడం అంత ఈజీ కాదన్న అభిప్రాయం పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతోంది. 

మూడు జిల్లాల్లో ఇద్దరే ఎమ్మెల్యేలు

వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో ప్రస్తుతం బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యేలు ఇద్దరే ఉన్నారు. వీళ్లలో ఒకరు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌రెడ్డి కాగా, మరొకరు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరడంలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ మరింత బలహీనపడింది. వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలకు, పల్లాకు మధ్య విభేదాలు ఇప్పటికే తారాస్థాయికి చేరాయి.

ఖమ్మం జిల్లాలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరడంతో అక్కడ రాకేశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి గెలుపు గురించి పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. మళ్లీ పల్లాకు చెందిన అనురాగ్‌‌‌‌‌‌‌‌ సంస్థల సిబ్బంది రంగంలోకి దిగితే తప్ప రాకేశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి గెలుపు అంత ఈజీ కాదని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు.