మాజీ స్పీకర్‌‌‌‌‌‌‌‌ ఇలాకాలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​కు షాక్‌‌‌‌‌‌‌‌

వర్ని, వెలుగు : మాజీ స్పీకర్‌‌‌‌‌‌‌‌ పోచారం శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న బాన్సువాడ నియోజకవర్గంలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు షాక్‌‌‌‌‌‌‌‌ తగిలింది. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పార్టీకి చెందిన నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా వర్ని మండలం జాకోరా విండో చైర్మన్‌‌‌‌‌‌‌‌ కృష్ణారెడ్డిపై డైరెక్టర్లు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. శనివారం డీసీవో శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌, ఆఫీసర్లు రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌, రియాజ్‌‌‌‌‌‌‌‌, సీఈఓ రామకృష్ణ ఆధ్వర్యంలో జాకోరా విండో  చైర్మన్‌‌‌‌‌‌‌‌పై అవిశ్వాస ఓటింగ్​ నిర్వహించారు.

విండోలో 13 మంది డైరెక్టర్లుండగా 10 మంది హాజరై అవిశ్వాసానికి మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీకి చెందిన దశరథ్‌‌‌‌‌‌‌‌ విండో చైర్మన్‌‌‌‌‌‌‌‌గా ఎన్నికైనట్లు డీసీవో శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. గతంలో  బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు 9 మంది డైరెక్టర్లుండగా, కాంగ్రెస్​కు కేవలం నలుగురు డైరెక్టర్లే ఉండేవారు. ఇటీవల విండో డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ దశరథ్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఆరుగురు డైరెక్టర్లు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ కు మద్దతిచ్చారు. 15 రోజుల కింద డైరెక్టర్లు విండో చైర్మన్‌‌‌‌‌‌‌‌ కృష్ణారెడ్డిపై అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చారు.