గోదావరి ఖనిలో 500 జమ్మి మొక్కలు నాటుతాం : కోరుకంటి చందర్‌‌‌‌‌‌‌‌

గోదావరిఖని, వెలుగు: దసరా పండుగను పురస్కరించుకొని గోదావరిఖనిలో 500 జమ్మి మొక్కలు నాటుతామని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. శుక్రవారం ఖనిలోని పార్టీ ఆఫీస్‌‌‌‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ దసరా రోజు జమ్మి చెట్టు ఆకులను ఒకరికొకరు పంచుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకోవడం ఆనవాయితీ అని అన్నారు.

రామగుండం కార్పొరేషన్​ పరిధిలోని ప్రతి డివిజన్‌‌‌‌లో, గ్రామాల్లో శనివారం 500 జమ్మి మొక్కలు నాటుతామన్నారు. ఇందులో అన్నివర్గాల ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.