ఆర్మూర్ టౌన్‌లో కాంగ్రెస్ లో చేరికలు

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ టౌన్‌లోని 2వ వార్డు పరిధి వడ్డెర కాలనీకి చెందిన వడ్డెర సంఘం, యువజన సంఘం ప్రతినిధులు, కుల పెద్దలు బుధవారం కాంగ్రెస్​ పార్టీలో చేరారు.  కౌన్సిలర్ సంగీతా ఖాందేష్,  ఖాందేశ్​ సత్యం ఆధ్వర్యంలో కాంగ్రెస్​ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ,  బీఆర్​ఎస్​ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

కార్యక్రమంలో టౌన్​ కాంగ్రెస్​ ప్రెసిడెంట్​ సాయిబాబాగౌడ్​, అయ్యప్ప శ్రీనివాస్, సంజయ్ సింగ్ బబ్లు, మోత్కురి లింగా గౌడ్, తదితరులు పాల్గొన్నారు.