స్నానపునీటిని ఫిల్టర్ చేసే.. సరికొత్త షవర్​ఫిల్టర్

వానాకాలంలో వాటర్​ పైప్​ లీకేజీలు, కుళాయిల్లో కాస్త కలుషితంగా ఉండే నీళ్లు రావడం మామూలే. అందుకే ఈ సీజన్​లో నీటిని డాక్టర్లు కాచి చల్లార్చి తాగాలని చెప్తుంటారు. మరి ఆ నీళ్లతో స్నానం చేయొచ్చా? అంటే వద్దనే చెప్తారు హెల్త్​ ఎక్స్​పర్ట్స్.  వాటిని ఫిల్టర్​ చేసేందుకు వాటర్​సైన్స్ కంపెనీ తెచ్చిన షవర్​ ఫిల్టర్​ వాడితే సరి. 

వాటర్‌‌సైన్స్ సీఎల్​ఈవో పేరుతో షవర్ ఫిల్టర్​ని మార్కెట్​లోకి తెచ్చింది. షవర్​ ఫాసెట్​ ప్లేస్​లో దీన్ని బిగిస్తే చాలు. ఇది నీళ్లలోని దుమ్ము, తుప్పు, మలినాలను ఫిల్టర్ చేస్తుంది. దానివల్ల జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. ఇది 60 డిగ్రీల సెల్సియస్​ టెంపరేచర్ ఉండే నీళ్లను కూడా ఫిల్టర్​ చేస్తుంది. 

అంటే దీన్ని గీజర్ లైన్‌‌కు కనెక్ట్‌‌ చేసి వాడుకోవచ్చు. ఈ షవర్​ ఫిల్టర్​తో పాటే ఇన్‌‌స్టలేషన్ కిట్​ కూడా వస్తుంది. దాంతో ఈజీగా ఇన్​స్టాల్​ చేసుకోవచ్చు. అయితే.. ఇది వాటర్​ టీడీఎస్​ని తగ్గించదు. నీటి హార్డ్​​నెస్​ని మాత్రమే తగ్గిస్తుంది. ధర: 1,945 రూపాయలు

మోడెక్స్​ 

కారులో చిన్న పార్ట్​ పాడైనా.. ఖర్చు మాత్రం పెద్దగానే ఉంటుంది. అందుకే కారులో ఏదైనా పాడవ్వడానికి ముందే తెలుసుకుని రిపేర్​ చేయించుకోవాలి. మరి దాన్ని ఎలా తెలుసుకోవాలి? అందుకోసం ఈ గాడ్జెట్​ కావాలి. మోడెక్స్​ అనే కంపెనీ దీన్ని మార్కెట్​లోకి తెచ్చింది. 

దీన్ని కారులో ఉండే ఓబీడీ–2 పోర్ట్​కి కనెక్ట్​ చేస్తే సరిపోతుంది. 2010 తర్వాత వచ్చిన దాదాపు అన్ని కార్లలో ఈ పోర్ట్ ఉంటుంది. కారుని సర్వీస్​కి ఇచ్చినప్పుడు మెకానిక్​లు ఈ పోర్ట్​కి వాళ్ల దగ్గరుండే డయాగ్నసిస్​ డివైజ్​ని కనెక్ట్​ చేసి ప్రాబ్లమ్స్​ ఉంటే తెలుసుకుంటారు. 

కానీ.. అప్పటికే సమస్య పెద్దదైతే.. కారులో పార్ట్స్​ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. కానీ.. ఈ ఓబీడీ –2 డివైజ్​ కనెక్ట్​ చేసుకుంటే సమస్య వచ్చిన వెంటనే తెలుసుకోవచ్చు. ఈ డివైజ్​ని టార్క్ లాంటి డయాగ్నస్టిక్ యాప్‌‌లతో బ్లూటూత్​ ద్వారా కనెక్ట్​ చేసుకోవచ్చు. 

దానివల్ల కారులో సమస్య తలెత్తినప్పుడు నేరుగా ఫోన్​కి నోటిఫికేషన్​ వస్తుంది. ఇది ఆండ్రాయిడ్​తోపాటు ఐఓఎస్​కు కూడా సపోర్ట్​ చేస్తుంది. దీంతో రియల్ టైం ఇంజిన్​ డాటాని తెలుస్తుంది. ఇంజిన్ సమస్యలతో పాటు కూలెంట్​ లెవల్​, టెంపరేచర్​, ఆయిల్​ టెంపరేచర్​, ఇంజిన్​ ఆర్​పీఎం, లోడ్​ వ్యాల్యూ, ఓ2 రీడింగ్స్​.. లాంటివన్నీ తెలుసుకోవచ్చు. ధర: 854 రూపాయలు

ప్రైస్​ ట్యాగ్​ గన్​ 

చిన్న చిన్న కిరాణా షాపులు, ప్రొడక్షన్​ యూనిట్లలో సరుకులకు ప్రైస్​ ట్యాగ్స్​ వేయాల్సి ఉంటుంది. అలాంటివాళ్లకు ఈ గాడ్జెట్ బెస్ట్​ చాయిస్​. సంవర్ధన్​ అనే కంపెనీ దీన్ని తయారుచేసింది. పైగా దీనికి పవర్​, బ్యాటరీలు కూడా అవసరం లేదు. 

ప్రింట్​ చేయాల్సిన నెంబర్లను ముందుగానే సెట్​ చేసుకుని గన్​కు ఉండే హ్యాండిల్​ని నొక్కితే ప్రింట్​ అయిపోతుంది. ఎనిమిది అంకెల వరకు ప్రింట్​ చేసుకోవచ్చు. ఇంక్​ అయిపోయినా ఈజీగా రీఫిల్​ చేసుకోవచ్చు. వన్ టచ్ ఓపెనింగ్ ఇంక్ రోలర్ సిస్టమ్​ ఉంటుంది. ఒక్కో లేబుల్ 22 మిల్లీమీటర్ల వెడల్పు, 12 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. 

ఈ గన్​తోపాటు ప్యాక్​లో 5,150  లేబుల్స్​,  రెండు ఇంక్ రోలర్లు కూడా వస్తాయి. ధర : 589 రూపాయలు 


ట్యాలీ కౌంటర్​

సాధారణంగా ఒకే పనిని ఎక్కువసార్లు చేయాల్సి వచ్చినప్పుడు ఆ పని ఎన్నిసార్లు చేశామో సరిగ్గా లెక్కపెట్టి, గుర్తుంచుకోవడం కాస్త కష్టమే. అందుకే జపం చేసేవాళ్లు చేతిలో రుద్రాక్ష మాలను పట్టుకుంటారు. ఒకసారి మంత్రం లేదా భగవంతుని నామస్మరణ పూర్తికాగానే ఒక రుద్రాక్షని విడుస్తుంటారు. 

కానీ.. ఈ ట్యాలీ కౌంటర్ వాడితే ఆ పని సులభం అవుతుంది. దీన్ని ఆస్ట్రోఘర్​ అనే కంపెనీ తీసుకొచ్చింది. దీనికి ఉండే బటన్‌‌ని నొక్కిన ప్రతిసారి ఎల్​సీడీ డిస్​ప్లే మీద నెంబర్​ మారుతుంటుంది. కౌంట్​ని రీసెట్ చేసుకోవడానికి మరో బటన్‌‌ ఉంటుంది. 

ఇది ఐదు అంకెల గరిష్ట సంఖ్య వరకు కౌంట్ చేస్తుంది. ఎక్స​ర్​సైజ్​ చేసేటప్పుడు, సర్కిల్​లో జాగింగ్​/ వాకింగ్​ లాంటివి చేసేటప్పుడు ఇది బాగా యూజ్​ అవుతుంది. ఇది ఒక చిన్న బ్యాటరీతో పనిచేస్తుంది. దీనికి ఉండే బెల్ట్‌‌ సాయంతో వేలికి కూడా పెట్టుకోవచ్చు. ధర : 59 రూపాయలు