Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త

ఈ ఏడాది ఎండలు ఎన్నడూ లేని విధంగా మండిపోతున్నాయి. ఎండ తీవ్రతకు జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో చాలా చోట్ల రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45డిగ్రీల కంటే ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా భానుడి ఉగ్రరూపాన్ని తప్పించుకోలేకపోతున్నారు ప్రజలు. ఎండ తీవ్రత వల్ల వడదెబ్బ తగలటం, డీహైడ్రేట్ అవ్వటం వంటి సమస్యలే కాకుండా, ప్రాణానికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. అవును నిజమే, వడగాలుల వల్ల బ్రెయిన్ స్ట్రోక్స్ ఎక్కువవుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు.

ఇటీవల కాలంలో సూరత్, జెంషద్ పూర్ లలో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు ఎక్కువయ్యాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలే ఇందుకు కారణమని గుర్తించారు డాక్టర్లు. బ్రెయిన్ స్ట్రోక్ కి గురవుతున్నవారిలో ఎక్కువమంది డయాబెటిక్ పేషేంట్లు, బీపీ పేషేంట్లు ఉన్నట్లు గుర్తించారు డాక్టర్లు.ఏసీలో ఉండి సడన్ గా ఎండలోకి వెళ్ళటం లేదా ఎండలో ఉండి సడన్ గా ఏసీలోకి వెళ్ళటం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. హార్ట్ అటాక్ తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ అత్యధిక మరణాలకు కారణమని చెప్పచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం మహిళల్లోనే ఎక్కువని డాక్టర్లు గుర్తించారు. ముఖ్యంగా 50నుండి 60ఏళ్ళ వయసు గల డయాబెటిక్, బీపీ పేషంట్స్ లో బ్రెయిన్ స్ట్రోక్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు:

  • అవయవాల్లో మార్పు కనిపించటం
  • కాళ్ళు, చేతులు, ముఖంలో తిమ్మిర్లు
  • మాట్లాడటంలో ఇబ్బంది
  • కంటి చూపు మందగించటం
  • వాంతులు, వికారం
  • శరీరం మొద్దుబారటం

బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: 

బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు మొదటి గంట సమయం చాలా కీలకం. పేషేంట్ ని ఇమ్మిడియట్ గా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి. ఏసీకి, ఎండకు పేషేంట్ ని దూరంగా ఉంచాలి. పేషేంట్ ని ఎండ నుండి వచ్చిన వెంటనే ఏసీలోకి తీసుకెళ్లకూడదు.