రోజు మొత్తం శరీరం ఒకే విధంగా ఉండదు. సమయాన్ని బట్టి ఆది మారుతుంది. అలిసిపోతుంది. అందుకే అన్ని పనులు ఉత్సాహంగా చెయ్యలేరు. కాబట్టి మెదడు ప్రతిస్పందనలను బట్టి నడచుకోవాలి. లేదంటే ఒత్తిడితో చిత్తుకాక తప్పదు. ముందుగా మీరు ఉదయం యాక్టివ్ గా ఉండే 'మార్నింగ్ పర్సనా? సాయంత్రం యాక్టివ్ గా ఉండే 'ఈవినెంగ్ పర్సనా? తెలుసుకోవాలి. 'పొద్దున లేస్తేనే సక్సెస్ వస్తది' అని సక్సెస్ ఫుల్ పర్సన్స్ చెప్పిన దాన్ని బట్టి మీ శరీర ధర్మానికి విరుద్ధం గా నడుచుకుంటే తిప్పలు తప్పవు. అయితే, పకృతి ధర్మాన్ని బట్టి మనిషి శరీరం పగలు పని చెయ్యడానికి, రాత్రి నిద్రించడానికి ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. పని చేసేటప్పుడు మెదడు తన పనితీరు పట్ల సంకేతాలు పంపిస్తుంది. వాటిని గుర్తించగలిగితే దానికి తగ్గట్టు మీ డేని ప్లాన్ చేసుకోవచ్చు.
ఒత్తిడిని ఉదయానికి
శరీర ధర్మాన్ని బట్టే పొద్దున నిద్ర లేస్తారు. ఒకవేళ 'మార్నింగ్ టైప్ 'కాకపోతే బలవంతంగా పొద్దున్నే లేచి పనులు మొదలు పెట్టొద్దు. శరీర ధర్మానికి విరుద్ధంగా పని చెయ్యడం. వల్ల ఇబ్బందులే తప్ప.. సక్సెస్ కాలేరు. అయితే ఉదయం అనేది రోజు మొత్తంలో చాలా ము ఖ్యమైనది. ఒత్తిడితో కూడిన పనులను పొద్దున సులభంగా పూర్తి చెయ్యగలుగుతున్నామని జపాన్ లో చేపట్టిన ఓ అధ్యయనంలో తేలింది. అధ్యయనంలో పాల్గొన్న వాళ్లను నిద్ర లేచిన రెండు గంటల తర్వాత, నిద్ర లేచిన పరీక్షించారు. వారిలో కార్టిసాల్ హార్మోన్ లెవల్ పొద్దున అధికంగా ఉంది. సాయంత్రం వరకు కార్టిసాల్ విడుదల తగ్గింది.
మెదడు పని తీరుకు కార్టిసాల్ లెవల్ ఒక సంకేతం. హాని చేసే వ్యాధి కారకాలతో పోరాడుతూ శరీరాన్ని రక్షించడంలో కార్టిసాల్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. కార్టినల్ బీపీని కూడా నియంత్రిస్తుంది. ఈ హార్మోన్ విడుదల అధికంగా ఉన్నప్పుడు మీరు ఒత్తిడిలో ఉన్నా.. ఎలాంటి భయం ఉండదు. మెదడు ఆధీనంలో ఉండి ఏదైనా చెయ్యడానికి శక్తి కూడా ఈ హార్మోనే సమకూర్చుతుంది. కష్టమైన పనుల్ని సాయంత్రం చేస్తున్నప్పుడు కార్టిసాల్ విడుదల తక్కువగా ఉండటం వల్ల ఒత్తిడికి గురవుతారు. అంతే కాకుండా సాయంత్రం ఒత్తిడితో కూడిన పనులు చెయ్యడం వల్ల ఒబెసిటీ, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలు కూడా వస్తాయని పరిశోధకులు హెచ్చిరిస్తున్నారు. 'ఒత్తిడితో కూడిన పనులని సాయంత్రం చెయ్యకుండా.. వదిలేస్తే.. వాటిని పొద్దున మెరుగ్గా పూర్తి చెయ్యగలరు. ఉదయం కార్టిసాల్ అధికంగా విడుదలవుతుంద'ని వాళ్లు పేర్కొన్నారు.
ఉష్ణోగ్రత మరో సంకేతం
మీరు ఉదయం పని చేసే వాళ్లయినా... సాయంత్రం పని చేసే వాళ్లయినా.. వయసు, జెండర్, సామాజిక, పని వద్ద వాతావరణం వంటి అనేక అంశాలు మీ పనిపై ప్రభావం చూపిస్తాయి. ఇవే గాక శరీర ఉష్ణోగ్రత కూడా మీ మెదడు పనితీరుకి సూచనలు పంపుతుంది. శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పుడు తక్కువ సామర్థ్యంతో పని చేస్తుంది. సాధారణంగా శరీరం సాయంత్రం పూట వేడిగా ఉంటుంది. ఈ సమయంలో ఒత్తిడిలేని చిన్న చిన్న పనులు చేసుకోవడం మేలు. జీవక్రియలు మారుతూ ఉండటం వల్ల వల్ల శరీరం వేడెక్కుతుంది. కృత్రిమంగా శరీరం వేడెక్కడం కూడా పని సా మర్ద్యంపై ప్రభావం చూపుతుంది. బాడీ టెంప రేచర్ 37 డిగ్రీలు దాటితే మెదడు మెరుగ్గా పని చెయ్యదు. తక్కువ నిద్ర పోవడం, వ్యాయామం చెయ్యకపోవడం, అప్రమత్తంగా ఉండకపో వడం వంటివి శరీర ఉష్ణోగ్రత పెరగడానికి దారి తీస్తాయి. మీ శరీర ఉష్ణోగ్రత ప్రకారం మీ పని తీరుని అంచనా వేయెచ్చని పరిశోధకులు అంటున్నారు.
స్లీప్ సైకిల్ ను పాటించండి
ఈవినెంగ్ పర్సెన్ అయినా మార్నింగ్ పర్సన్ అయినా... స్లీప్ సైకిల్ ని గౌరవిస్తే మంచిది. ఆరోగ్యం నుంచి దూరం కావొద్దంటే రాత్రి నిద్ర చాలా అవసరం. నిద్రకు సరైన టైమ్ కేటాయించాలి. సరైన నిద్ర, వ్యాయామం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. దీంతో ఒత్తిడిని తట్టుకునే శక్తి పెరుగుతుంది.