నార్కట్‌పల్లి, వెలుగు : బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు నిర్మాణం తన చిరకాల స్వప్నమని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. బ్రాహ్మణ వెల్లెంల ఉదయసముద్రం ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన సందర్భంగా రిజర్వాయర్ పరిధిలోని ఆయకట్టు రైతులు, కాంగ్రెస్నాయకులు ఆదివారం నార్కెట్‌పల్లిలో మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బత్తుల ఉషయ్య రైతుల పక్షాన మంత్రికి జ్ఞాపికను అందజేశారు. నకిరేకల్ లో పెండింగ్‌లో ఉన్న ధర్మరెడ్డిపల్లి కాల్వను పూర్తి చేసి స్వచ్ఛమైన నీటిని అందిస్తామని ఆయన తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ రమేశ్, జిల్లా కాంగ్రెస్ నాయకుడు వడ్డె భూపాల్ రెడ్డి, కౌన్సిలర్ వేణుగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.