ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఘన నివాళి 

నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌, వెలుగు: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్ధంతిని శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిర్వహించారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎస్‌‌‌‌‌‌‌‌సీ సెల్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడు అరుణ్ కుమార్ అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫొటోకు నివాళులర్పించారు.

జగిత్యాల కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో కలెక్టర్​ సత్యప్రసాద్‌‌‌‌‌‌‌‌, అడిషనల్ కలెక్టర్ లత, కోరుట్ల మున్సిపాలిటీలో మున్సిపల్‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ లావణ్య, ఆర్డీవో జివాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు నివాళులర్పించారు. ఎమ్మెల్యే సంజయ్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఆయన ఇంట్లోనే అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫొటో వద్ద నివాళులర్పించారు. హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌, బీజేపీ, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ పార్టీల ఆధ్వర్యంలో, సిరిసిల్ల జిల్లా కేంద్రంలో లైబ్రరీ సంస్థ చైర్మన్​ నాగుల సత్యనారాయణ, కోనరావుపేట, మల్యాల మండలకేంద్రాల్లో కాంగ్రెస్​ లీడర్లు నివాళులర్పించారు.